ఆంటీ వయస్సున్న హీరోయిన్‌పై మోజు పడ్డ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ..?
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని తన సంచలన ప్రదర్శనతో అబ్బురపరిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి, ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన సెంచరీగా (క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ తర్వాత) ఇది నిలిచింది.
తన శతకంలో బౌండరీల ద్వారా సాధించిన పరుగుల శాతం ప్రపంచంలోనే అత్యధికంగా (93%) నిలిచి, 58 మంది సెంచరీ హీరోల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక సెంచరీలో బౌండరీల ద్వారా సాధించిన అత్యధిక పరుగుల శాతంగా రికార్డు సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన భారతీయ బ్యాటర్‌లలో ఒకడిగా మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కి 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

ఈ యువ సంచలనంపై బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ అభిమానం వ్యక్తం చేయడం, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆసక్తికరంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే స్టార్ బౌలర్ల బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన వైభవ్‌కు, 7 మ్యాచ్‌లలో 252 పరుగులు (ఒక సెంచరీతో సహా) 206.55 స్ట్రైక్ రేట్‌తో సాధించినందుకు 'స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డు లభించింది. బహుమతిగా టాటా కర్వ్ కారును అందుకున్నప్పటికీ, 18 ఏళ్లు నిండకపోవడంతో అతను స్వయంగా నడపలేడు. వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక గొప్ప ఆశాకిరణంగా నిలిచాడు.












Click it and Unblock the Notifications