సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో

సినీ పరిశ్రమలో ఒక్కొక్క హీరో ప్రతి సినిమాకి రూ.70 నుంచి రూ.100 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు హీరోలకు పారితోషికంతోపాటు వాణిజ్య ప్రకటనలద్వారా కూడా ఆదాయం వస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్ చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడం, మళయాళ పరిశ్రమల్లో టాప్ మోస్ట్ హీరో ఎవరు ..? ఏ హీరోకి ఎక్కువ ఆస్తి ఉంది..? ఏ హీరో ఎక్కువ పారితోషకం తీసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు? అనే విషయం వైరల్ గా మారింది.

సౌత్ ఇండియాలో అనేక మంది హీరోలు ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటూ దక్షిణ భారతదేశంలో రిచెస్ట్ యాక్టర్ అనగానే ఒక పేరు వినిపిస్తుంది.సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే అక్కినేని నాగార్జున అంటూ వినిపిస్తోంది. ప్రముఖ మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం అక్కినేని నాగార్జున టోటల్ ఆస్తి విలువ రూ.3270 కోట్లుగా చెబుతున్నారు. సౌత్ ఇండియాలో భారీ సినిమాలు చేస్తున్న చిరంజీవి - బాలకృష్ణ - కమల్ హాసన్ - వెంకటేష్ - విజయ్ - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ - ప్రభాస్... ఇలా వీరందరికన్నా నాగార్జునకే ఎక్కువ ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

south india richest hero property value

జైలర్ సినిమాకి రజనీకాంత్ రూ.110 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఆయన ఆస్తి రూ.430 కోట్లు ఉంటుందని అంచనా. లియో సినిమా కోసం విజయ్ తళపతి రూ.130 కోట్లు తీసుకుంటే ఇండియన్ 2 కోసం కమలహాసన్ రూ.150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి రూ. 150 కోట్ల పారితోసికం తీసుకుంటున్నారు. ఎంతమంది స్టార్స్ వందల కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నప్పటికీ నాగార్జున మాత్రం తన సినిమాలకి తీసుకునే పారితోషికం కేవలం రూ.45 - 50 కోట్లు మాత్రమే . అయినా నాగార్జు ఆస్తి విలువ రూ.3వేల కోట్లు ఎప్పుడో దాటింది. దీనికి కారణం ఆయనకున్న వ్యాపారాలు, వ్యాపార దక్షతేఅని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+