విడాకుల తర్వాత తాగుడుకు బానిసైన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన మనీషా కొయిరాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లను అందుకుంటోంది. తన నటనతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ రోజుల్లో మనీషా కొయిరాలా సినిమాలో నటించిందంటే చాలు థియేటర్లు ఖాళీ ఉండేవి కావు.
అంత క్రేజ్, అంత పలుకుబడిని సంపాదించుకుంది మనీషా. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. మనీషా కొయిరాలా తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. కొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో కొద్దికాలం మంచానికే పరిమితమైంది. అంతేకాకుండా విడాకులు తీసుకున్న తర్వాత తాగుడికి బానిస అయింది. మానసికంగా సమస్యలను ఎదుర్కోలేక డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్టర్, ఓసీడీ లాంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ సమయంలోనే మద్యానికి బాగా అలవాటుపడింది.

హీరోయిన్ గా కెరీర్ పీక్ స్థాయిలో ఉన్న సమయంలో నేపాల్ కు చెందిన సామ్రాట్ తో 2010లో వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. తన భర్త పెట్టే టార్చర్ భరించలేక మనీషా చివరకు పెద్దల సమ్మతితో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తాను విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిస అయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన క్రిమినల్ సినిమాలో నటించింది. నేపాల్ మాజీ ప్రధాన మంత్రి బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలే మనీషా కొయిరాలా. నేపాలీ చిత్రం ఫేరిభేతౌలా తో పరిశ్రమలోకి అడుగుపెట్టింది.












Click it and Unblock the Notifications