నెక్స్ట్ లెవెల్లో తేజ సజ్జా, మంచు మనోజ్ " మిరాయ్ " టీజర్.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్ !
తెలుగు చిత్ర పరిశ్రమలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ " హనుమాన్ " చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అదే జోష్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో "మిరాయ్" అనే చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో 2025 సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం చిత్రబృందం మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది.
టీజర్ ఎలా ఉందంటే..?
జరగబోయేది మారణ హోమం... శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం... అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతోంది. ఆ తర్వాత విలన్‌గా మంచు మనోజ్ ఎంట్రీ అదరగొట్టారు. చాలా గ్యాప్ తర్వాత బ్యాక్ టూ యాక్షన్ అనేలా కుమ్మేశారు. కంటెంట్‌కు తగ్గ విజువల్ గ్రాండియర్‌తో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక హీరో తేజా సజ్జా మరోసారి ప్రామిసింగ్ యాక్టింగ్ తో కష్టపడ్డారు. టీజర్‌ని చూస్తే 2Dతో పాటు 3D ఫార్మాట్లో సినిమా వస్తోందని అర్థమవుతుంది. గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

అంతే కాకుండా ముఖ్యపాత్రల్లో జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ కనిపించి మెప్పించారు. హీరోయిన్ గా రితికా నాయక్ మంచి ఫీల్ తీసుకొచ్చింది. అలానే టీజర్ క్లైమాక్స్ లో వచ్చే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దీంతో తేజకు మరో విజయం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
మిరాయ్ స్టోరీ..
'మిరాయ్' కథ ఒక భారీ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కథ ప్రకారం.. మానవులను దేవతలుగా మార్చగల శక్తి ఉన్న తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించేందుకు ఒక యోధుడు నియమించబడతాడు. ఈ గ్రంథాలు చక్రవర్తి అశోకుని రహస్య గ్రంథాలుగా పేర్కొనబడతాయి. ఈ గుట్టును దాచిపెట్టి, ఆ శక్తుల్ని దుర్వినియోగం చేయదలచిన శక్తులకు వ్యతిరేకంగా పోరాడే కథలో తేజా సజ్జా పాత్ర కీలకంగా మారుతుంది. చివరకు ఏం జరిగింది అనేది స్టోరీ.












Click it and Unblock the Notifications