రూ.వేల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న తెలుగు స్టార్ నటుడు

పెళ్లిపందిరి, దేవుళ్లు, పెళ్లి, ప్రేయసిరావే వంటి సినిమాలతో మంచి పాపులర్ అయ్యాడు నటుడు పృథ్వీ. 1990 దశాబ్దంలో ఎంతో బిజీగా ఉండేవాడు. ఏడాదికి ఏడు నుంచి ఎనిమిది సినిమాలు చేస్తుండేవాడు. రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉండేది. దీంతో కొంత ప్రాపర్టీ కొనాలని నిర్ణయించుకొని తెలిసిన స్నేహితుడిని అడిగాడు. అతను దాదాపు 100 ఎకరాల భూమి చూపించి అంతా కలిపి 100 ఎకరాలకే ఇచ్చేస్తానని, వెంటనే రిజిస్ట్రేషన్ పనులు కూడా ప్రారంభిస్తానని చెప్పాడు. దీనికి సంబంధించిన భూమిని కూడా అతను చూపించడంతో పృథ్వీ ఓకే అన్నాడు.

అయితే అతను ఈ విషయాన్ని తన డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తితో మాట్లాడాడు. అతనేమో ఎంతో నెగెటివ్ గా మాట్లాడాడు. రాతినేల చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటేనే రూ.20 లక్షలు అవుతుందని, కొన్నదానికన్నా దాన్ని బాగుచేసుకున్నందుకే ఎక్కవ ఖర్చు పెట్టాల్సి వస్తోందని, పెట్టుబడి భారీగా పెట్టాలని చెప్పి భయపెట్టాడు. ఈ విషయాన్ని పృథ్వీ తేలిగ్గా తీసుకొని అంతటితో వదిలేశాడు. అయితే కొన్నాళ్ల సర్వాత సన్నివేశం మొత్తం మారిపోయింది. తాను వద్దనుకున్న భూమిలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఒక ఎకరం విలువే కోట్ల రూపాయల్లో ఉంది. అలా చూసుకున్నా వేల కోట్ల రూపాయలకు అధిపతిగా మారేవాడు. కానీ డ్రైవర్ వద్దన్నాడని కోట్ల ఆస్తులను వదిలేసుకున్నాడు. ప్రస్తుతం చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే యానిమల్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు.

telugu actor prithviraj lost thousand crores value property

పృథ్వీలానే నటి జయసుధ కూడా వేరేవారి మాటలు విని కొన్న ఆస్తిని కూడా అమ్మేశారు. అమ్మిన భూముల విలువ దాదాపు రూ.200 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవలే ఆమె ఈ విషయాన్ని తెలిపారు. తాను ఆ స్థలం కొన్నప్పుడు శోభన్ బాబు ఎంతో సంతోషించారని, మంచి పని చేస్తున్నావంటూ పొగిడారన్నారు. కానీ అది కూడా వేరేచోట తీసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని అమ్మేసి వేరేచోట తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అలా వదులుకున్నవి రెండు ప్రాంతాల్లో రెండు ఖరీదైన స్థలాలున్నాయని ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జయసుధ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+