తెలుగు నిర్మాతకు త్రిష షాక్!
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో సెలబ్రెటీలు వ్యవహరిస్తుంటారు. క్రేజ్, డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ల రెమ్యూనరేషన్‌ను కూడా అమాంతం పెంచేస్తుంటారు. ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్లు కాస్త ఫర్వాలేదనుకుంటున్నప్పటికీ ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా తమ పారితోషికాన్ని భారీగా పెంచేస్తున్నారు. 40 సంవత్సరాల వయసులోను ఏమాత్రం వన్నె తరగతి అందంతో కట్టిపడేస్తున్న త్రిష వరుస హిట్లతో దుమ్మురేపుతోంది.
పొన్నియన్ సెల్వన్ విజయంతో త్రిష మంచి జోరందుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. విజయ్ సరసన త్రిష చేసిన లియో సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దీంతో త్రిష తన పారితోషికాన్ని పెంచేసింది. డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ సినిమా 'థగ్ లైఫ్'లో కూడా త్రిష ఛాన్స్ కొట్టేసింది. ఇందులో కమల్ హాసన్ సరసన నటించబోతోంది.

తెలుగు నిర్మాతలు కొందరు సీనియర్ హీరోల సరసన నటించమని అడగడానికి త్రిషని సంప్రదించారు. అయితే ఆమె చెప్పిన పారితోషికం విని కళ్లు తేలేసినంత పనైందంటున్నారు. సినిమాకు రూ.4కోట్ల చొప్పున త్రిష అడిగినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా అనగానేత్రిష ఇలా షాకులివ్వడం కొత్తేం కాదు. గతంలో కూడా త్రిష రెమ్యునరేషన్ కారణంగా చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను తిరస్కరించింది. ఈ వయసులో కూడా త్రిషకి సాలిడ్ క్రేజ్ ఉంది కాబట్టి నిర్మాతలు కూడా వెంటపడుతున్నారు. త్రిష చేసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అవుతుండటంతో అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇంతవరకు ఏ దక్షిణాది హీరోయిన్ రూ.12 కోట్ల పారితోషికాన్ని తీసుకోలేదు. కమల్ హాసన్ సినిమాలో నటించడద్వారా దాన్ని అందుకోబోతున్న త్రిష రికార్డు కొట్టేసినట్లే అంటున్నారు.












Click it and Unblock the Notifications