అదిరిపోయింది... 'హనుమాన్' సీక్వెల్ లో ఆ స్టార్ హీరో?
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ ఐదు రోజులుగా సంచలన రికార్డులు సృష్టిస్తోంది. తక్కువ బడ్జెట్ తో అంత నాణ్యమైన గ్రాఫిక్స్ ఎలా సాధ్యమైంది? అనే చర్చ ఇండియా మొత్తం నడుస్తోంది. అందరూ దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను కేవలం రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఓవర్సీస్ లో ఇప్పటికే మూడు మిలియన్ డాలర్లను వసూలు చేసి ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు దిశగా పరుగులు తీస్తోంది.
స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని రీతిలో విదేశాల్లో సంచలన రికార్డులు సృష్టిస్తోంది. అంతేకాదు.. ఉత్తర భారతదేశంలో హిందీ బెల్టులో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు కూతవేటు దూరంలో ఉంది. రాబోయే రెండురోజుల్లో ఆ రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

నార్త్ ఇండియాలో మొన్నటివరకు ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుకుంటున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో ఇలాంటి గ్రాఫిక్స్ అందరికీ సాధ్యం కాదనే చర్చ నడుస్తోంది. ఉత్తర భారతదేశంలో శ్రీరాముడి సెంటిమెంట్ ఎక్కువ.. అంతేకాదు.. వారిలో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ పేరునుబట్టి భక్తిభావంతో సినిమాకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో హనుమంతుడి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని, రియలిస్టిక్ వెర్షన్ లోనే వాటిని తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ వర్మ తెలిపారు. హనుమాన్ 2 లో స్టార్ హీరో అడవి శేష్ ఒక మంచి రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. భవిష్యత్తులో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను బద్దలు కొట్టడంతోపాటు కొత్త రికార్డులను సృష్టించనుందో చూడాలి.












Click it and Unblock the Notifications