'ది కేరళ స్టోరీ 2' విడుదలపై సస్పెన్స్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్‌గా వస్తున్న 'ది కేరళ స్టోరీ 2' విడుదలపై నీలినీడలు ముసురుకున్నాయి. కేరళ రాష్ట్రాన్ని, ఓ వర్గం ప్రజలను కించపరిచేలా ఈ సినిమా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఈ చిత్రం విడుదలపై మధ్యంతర స్టే విధించింది. కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు సినిమాను విడుదల చేయవద్దని హైకోర్టు మేకర్స్‌ను ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు, వివాదం
విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27, శుక్రవారం నాడు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ నంబూద్రి అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమే అనిపిస్తున్నాయి. విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు సినిమాను విడుదల చేయవద్దు" అని మేకర్స్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకుముందు సినిమాను చూడాలని కోర్టు కోరగా.. మేకర్స్ అందుకు నిరాకరించారు.

కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వాదన
ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు నిర్ణయానికి మద్దతుగా నిలిచింది. సినిమా వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, ఇది రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపడం లేదని కేంద్రం తరపు న్యాయవాది వాదించారు. సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొన్నారు.సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది వాదిస్తూ.. 'ఢిల్లీ బెల్లీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'గో గోవా గాన్' వంటి సినిమాల పేర్లు కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చని, అలాగని ప్రతిదానికీ అభ్యంతరం చెబితే ముగింపు ఉండదని తర్కించారు.
పిటిషనర్ ఆరోపణలు ఏమిటి?
మలయాళీ బ్రాహ్మణుడిగా తనను తాను పరిచయం చేసుకున్న పిటిషనర్ శ్రీదేవ్ నంబూద్రి, ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా కథ ఉత్తర భారతదేశంలోని ముగ్గురు మహిళల చుట్టూ తిరుగుతున్నప్పుడు, టైటిల్‌లో 'కేరళ' అని పెట్టడం రాష్ట్రాన్ని తప్పుగా చూపడమేనని ఆయన వాదించారు. ఇది ముస్లింలను, కేరళను కించపరిచేలా ఉన్న ప్రచార చిత్రమని ఆయన ఆరోపించారు. సినిమాకు ఇచ్చిన U/A సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు.
కోర్టు ప్రశ్నలు
విచారణ సందర్భంగా కోర్టు కూడా కొన్ని కఠినమైన ప్రశ్నలు సంధించింది. "షరియా చట్టం ప్రతిచోటా వర్తిస్తుంది" వంటి డైలాగులు ఏ ప్రాతిపదికన పెట్టారని ప్రశ్నించింది. కేరళ మత సామరస్యానికి పెట్టింది పేరని.. ప్రాథమికంగా చూస్తే సినిమా రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. గురువారం(నేడు) నాడు ఈ కేసుపై కేరళ హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్లకు వస్తుందా లేదా అన్నది కోర్టు ఇచ్చే ఉత్తర్వులపైనే ఆధారపడి ఉంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications