ఆ ఇష్యూవల్లే ఆ హీరోతో సినిమా తీయను: రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అమరశిల్పి జక్కన్నా ఒక్కో సన్నివేశాన్ని చెక్కుకుంటూ వస్తారు. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. సినిమా బాగా వచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడని మనస్తత్వం రాజమౌళిది. సన్నివేశం సరిగా రాకుండా అవరమైతే వందసార్లైనా మళ్లీ నటీనటులతో చేపిస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు.
పరిశ్రమలో అందరు హీరోలతో రాజమౌళి సినిమా తీశారు. అల్లు అర్జున్ తో మాత్రం తీయలేదు. మగధీర సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రాజమౌళికి అల్లు అరవింద్ తో విభేదాలు తలెత్తాయి. సినిమా విడుదలకు సంబంధించిన విషయంలో వివాదం రేకెత్తింది. దీంతో అల్లు అరవింద్ ను రాజమౌళి పక్కన పెట్టేశాడంటారు. ఇప్పటివరకు అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి సినిమా చేయలేదు. అలాగే ఆయన కొడుకు అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయలేదు. భవిష్యత్తులో ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. గతంలో చోటుచేసుకున్న ఈ ఇష్యూ వల్లే అల్లు అర్జున్ తో సినిమా చేయనని రాజమౌళి చెప్పేశారు.

రాజమౌళితో పనిచేయడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా? అని అందరూ ఎదురు చూస్తుంటారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, ప్రభాస్, రవితేజ తదితర హీరోలతో రాజమౌళి సినిమాలు తీశాడుకానీ అల్లు అర్జున్ తో తీయలేదు. భవిష్యత్తులోనైనా రాజమౌళి తమ అభిమాన హీరోతో సినిమా తీస్తాడేమోనని బన్నీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications