ఈ ఏడాది ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లు
దక్షిణ భారతదేశంలో స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో కూడా తమ హవాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యానిమల్ సినిమాతో రష్మిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. జవాన్ తో నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సిటాడెల్ సిరీస్ తో అలరించడానికి సమంత సిద్ధమైంది. త్రిష, కీర్తి సురేష్ లాంటివారు కూడా పారితోషికాన్ని భారీగా తీసుకుంటున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
ఇటీవలే ఖుషి సినిమాతో సమంత హిట్ అందుకుంది. అనారోగ్యం వల్ల ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంది. త్వరలోనే సిటాడెల్, చెన్నై స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఒక్కో సినిమాకు రూ.4కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ అంటే నయనతార. హీరోల కన్నా ఎక్కువ పారితోషికాన్ని తీసుకుంటుంది. జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీకి నయన్ ఏకంగా రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంది. ఈ ముద్దుగుమ్మ చేసే తదుపరి చిత్రాలకు మరింత పారితోషికం అడుగుతోందంటున్నారు.
త్రిష.. దాదాపు 21 సంవత్సరాలుగా దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతోంది. నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ లతో ప్రేక్షకులను ఈ అమ్మడు అలరిస్తోంది. ఈ ఏడాది రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటోంది.

తమన్నా.. ఈ అమ్మడు కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ రూ. 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. ఓటీటీ ప్లాట్ ఫాంపై వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం రూ.3 కోట్లు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications