శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్ఠతకు అరుదైన గుర్తింపు- టీటీడీ 'బంగారం' లాంటి నిర్ణయం..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వరస సెలవులు రావడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య సాధారణ రోజుల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి ఉన్నాయి. కాగా, శ్రీవారి లడ్డూ ప్రసాదం 310 సంవత్సాల క్రితం ప్రారంభించినట్లు నిర్దారణకు వచ్చిన టీటీడీ ప్రభుత్వానికి తాజాగా కీలక ప్రతిపాదనలు చేసింది.

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూకు ప్రత్యేకత ఉంది. కోట్లాది మంది భక్తులు ఈ లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే అంతటి నాణ్యమైన లడ్డూను కచ్చితంగా ఎప్పుడు ప్రారంభించారనే స్పష్టమైన సమాచారం టీటీడీ వద్ద ఇంతవరకు లేదు. సుమారు 310 సంవత్సరాలవుతున్నట్లు తాజాగా ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి గల చరిత్ర, ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ బంగారు నాణెం విడుదల చేయాలన్న ప్రతిపాదనను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే.. సెప్టెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నాణెం విడుదల చేసేందుకు టీటీడీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

 ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు, అరుదైన అవకాశం- షెడ్యూల్.. సేవలు..!!
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు, అరుదైన అవకాశం- షెడ్యూల్.. సేవలు..!!
ttd-proposes-special-gold-coin-to-celebrate-310-years-of-srivari-laddu-prasadam-here-the-details

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

తిరుమల లడ్డూకు శతాబ్దాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో శ్రీవారి ప్రసాదంగా మొదట వడ ఇచ్చేవారని అనంతరం బూందీ ప్రవేశపెట్టగా కాలక్రమేణా లడ్డూకు ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లు చెబుతున్నారు. 1803లో బ్రిటీషువారు శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. విశిష్టత కలిగిన తిరుపతి లడ్డూకు 2009లో జీఐ (భౌగోళిక గుర్తింపు) లభించింది. పేటెంట్ హక్కులు ఉన్నాయి కనుకే టీటీడీ అనుమతి లేకుండా ఈ లడ్డూను మరెవరూ తయారు చేయకూడదనే నిబంధనలు అమలు అవుతున్నాయి. దీంతో, ఇప్పుడు టీటీడీ తాజా ప్రతిపాదనల పైన ప్రభుత్వం నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. అదే విధంగా జూలై నెలలో తిరుమల హుండీ ఆదాయం కొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా రూ 140.28 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. జూలై నెలలో 24.52 లక్షల మంది భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఇక.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహణ కు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+