తగలబడిపోతది.. దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు..!!

దానం నాగేందర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానం పై న్యాయస్థానం అనర్హత వేటు తో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమైంది. ఇప్పటికే ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. త్వరలో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించనుంది. కాగా.. ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ మహిళా నేత విజయా రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ సంచలనంగా మారిందది. ఇక.. ఇటు దానం నాగేందర్ సర్ ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ లో తొలిగించిన ఓట్ల పైన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక చుట్టూ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే ఉప ఎన్నిక ఖాయం కావటంతో కాంగ్రెస్ నుంచి తిరిగి దానం నాగేందర్ పోటీ చేస్తారని చెబుతున్నారు. అదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ నుంచి అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇటు ఎన్నికల సంఘం త్వరలోనే ఈ ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఎన్నిక పైన అభ్యర్దిత్వం పైన కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి- దానం మధ్య పోటీ నెలకొంది. విజయా రెడ్డి తాజాగా ఈ ఉప ఎన్నిక పైన హైకోర్టను ఆశ్రయించారు. కాగా.. ఇటు దానం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. SIR లో భాగంగా ఖైరతాబాద్ లో తీసేసిన ఓట్లు తిరిగి పునరుద్దరించకుంటే ఊరుకొనేది లేదని దానం హెచ్చరించారు. హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు.. తగలబడి పోతుందంటూ వ్యాఖ్యానించారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి వీళ్లేదు, బిగ్ ట్విస్ట్...!!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి వీళ్లేదు, బిగ్ ట్విస్ట్...!!
danam-nagender-warns-over-deletion-of-votes-in-khairatabad-made-sensational-comments

దానం వ్యాఖ్యల పై వివాదం

సర్ ప్రక్రియలో భాగంగా తన నియోజకవర్గంలో 20 వేల ఓట్లను తెలిగించారని దానం చెప్పారు. ఎస్‌ఐఆర్‌ గురించి రాహుల్‌ గాంధీ పదే పదే ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. ఇప్పుడు మా నియోజకవర్గంలో ప్రత్యేకించి 20 వేల ఓట్లు ఇప్పటివరకు కట్ చేశారని చెప్పుకొచ్చారు. వారికి నోటీసులు ఇచ్చారని.. దాన్ని సరిచేయాలని డిమాండ్ చేసారు. ఇందులో చాలా మంది బీజేపీతో అనుబంధంగా.. ఎవరైతే ఏఎంసీలున్నరో.. ఏఆర్‌వోలున్నరో బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నానని... ఎవరైతే మా ఓట్లు తీయించే ప్రయత్నం జరుగుతున్నదో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఓటు చోరీ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తమ పై ఉందన్నారు. ఇప్పటిదాకా డిలీట్‌ చేసిన ఓట్లను మళ్లీ పరిగణలోకి తీసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేసారు. కాగా.. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం వేళ దానం చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+