వేలాకంణి ఉత్సవాల వేళ ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. వేళాంకన్ని ఉత్సవం 2026 సందర్భంగా అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ లోకమాన్య తిలక్ - వేళాంకన్ని - లోకమాన్య తిలక్ మధ్య ప్రత్యేక రైలు సేవలను అందిస్తోంది. ఈ ట్రైన్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిపించేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. వారి కోసం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తమిళనాడులో ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 8 వరకు జరగనున్న వేలంకన్ని ఉత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆగస్టు 26, సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ నెంబర్ 01161 లోకమాన్య తిలక్ - వేళాంకన్ని బుధ, సోమ వారాల్లో ఉదయం 11.50 గంటలకు బయల్దేరుతుంది. శుక్ర, బుధవారాల్లో వేళాంకన్నికి ఉదయం 2 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సర్వీస్ ఆగస్టు 26, సెప్టెంబర్ 7వ తేదీన రెండు సర్వీసులు నడవనున్నాయి. 01162 ట్రైన్ వేళాంకన్ని నుంచి శుక్ర, బుధవారాల్లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరుతుంది. శని, గురువారాల్లో సాయంత్రం 4 గంటలకు లోకమాన్య తిలక్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ సర్వీసులు ఆగస్టు 28, సెప్టెంబర్ 9వ తేదీల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

 ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు, అరుదైన అవకాశం- షెడ్యూల్.. సేవలు..!!
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు, అరుదైన అవకాశం- షెడ్యూల్.. సేవలు..!!
railways-annonces-special-trains-between-lokmanya-tilak-velankanni-form-august-29-here-the-detai

రూట్ .. షెడ్యూల్

అదే విధంగా ఈ ప్రత్యేక రైళ్లు థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణమలై, విల్లుపురం, మయిలా దుతురై జంక్షన్, నాగపట్నం స్టేషన్లలో రెండువైపులా ఆగనున్నాయి. ముందస్తు రిజర్వేషన్లు 02.08.2026(ఆదివారం) ఉదయం 08:00 గంటలకు ప్రారంభమవుతాయని... ఈ రైళ్లలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+