డైరెక్ట్ గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

టాలీవుడ్ లో కామెడీ మూవీస్ కు ఎప్పుడూ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. టాలీవుడ్ యంగ్ కమెడియన్ హ‌ర్ష‌చెముడు ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు అక్టోబ‌ర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కామెడీ మూవీలో హ‌ర్ష‌చెముడుతో పాటు హైప‌ర్ ఆది, ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్, రూప శ్రావ్య‌, జీవన్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సెప్టెంబర్ 30వ తేదీనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడింది. అయితే తాజాగా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి బాబు డెగాల దర్శకత్వం వహించారు. ఇక లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాకు అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించారు. అలాగే శక్తి అరవింద్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడం కచ్చితం అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ట్రైలర్ ప్రకారం.. హర్ష చెముడుకు ఉద్యోగం లేక‌పోవ‌డంతో పెళ్లి చేసుకోవ‌డానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. జాబ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన అత‌ను ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. సాఫ్ట్ వేర్ పై ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా ఉద్యోగంలో చేరిన అత‌ను అక్క‌డ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు..? స‌హోద్యోగుల‌తో అత‌డి స‌రాదాల‌తో ట్రైల‌ర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. క్రింజ్ కామెడీ ఆఫ్ ది ఇయర్ అని ట్రైలర్ లో పేర్కొనడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఈ ట్రైలర్ లో హైప‌ర్ ఆది పంచ్‌ లు, హ‌ర్ష చెముడు, జీవ‌న్ కుమార్‌ కామెడీ టైమింగ్ హైలైట్‌ గా నిలిచాయి.

Tollywood comedy movie least Eligible Bachelor directly to OTT streaming ETV Win starting October 9

ఇక ఈ మూవీ డైరెక్టర్ బాబు డెగాల దర్శకుడిగా మారకముందు జబర్దస్త్ లో తన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. తన ఊరిలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అలా జబర్దస్త్ లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. గతంలో ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆయన ప్రస్తుతం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాను డైరెక్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+