డైరెక్టర్ " కేకే " ఆకస్మిక మృతి.. ఈయనకే సందీప్ రెడ్డి వంగా ఏడీగా !!
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా మరణించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కేకే తుదిశ్వాస విడిచినట్లు ఆయన దర్శకత్వం వహించిన "కింగ్ జాకీ క్వీన్" మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియల్సి ఉంది. చాలా గ్యాప్ తర్వాత మరి కొద్దిరోజుల్లోనే కేకే డైరెక్షన్ చేసిన సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో అనూహ్యంగా ఇలా జరగడం సర్వత్రా విషాదం నింపుతోంది.
కాగా కిరణ్‌కుమార్ తన కెరీర్‌ను 'కేడీ' చిత్రంతో దర్శకుడిగా ప్రారంభించారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన కొంతకాలం దర్శకత్వానికి విరామం తీసుకున్నారు. అనంతరం అగ్ర దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు.

అలానే కేవలం దర్శకుడి గానే కాకుండా ఇటీవల నటుడిగా కూడా రూట్ మార్చారు. విజయ్ ఆంటోనీ నటించిన 'భద్రకాళి' సినిమాలో సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే ఒక వైపు దర్శకత్వం.. మరోవైపు నటుడిగా బిజీ అవుతుండగా ఊహించని రీతిలో ఈ విషాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
కేకే దర్శకత్వంలో రూపొందిన ' కింగ్ జాకీ క్వీన్' చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా.. 'కె ర్యాంప్' మూవీ హీరోయిన్ యుక్తి తరేజా హీరోయిన్‌గా కనిపించనుంది. ఎస్‌ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించనున్నారు. ఆగస్టు నెలలో విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.












Click it and Unblock the Notifications