తెలుగు సినీ చరిత్రలో భారీ నష్టాలను మిగిల్చి రికార్డు సృష్టించిన 2 సినిమాలు
సినిమా అన్న తర్వాత అనేక రికార్డులుంటాయి. భారీ బ్లాక్ బస్టర్ కావడం, ఇండస్ట్రీ హిట్ కొట్టడం, సంచలన వసూల్లు రాబట్టడం, రూపాయికి 5 రూపాయలు సంపాదించిపెట్టడం, అలాగే ఫ్లాప్ అయినా దారుణమైన డిజాస్టర్ గా... ఇలా సినిమా పలురకాలుగా రికార్డులు నెలకొల్పుతుంది. మన తెలుగు సినిమాల చరిత్రలో ఇప్పటివరకు దారుణమైన డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎంత డిజాస్టర్ అయినా ఎంతోకొంత తక్కువ మొత్తంలోనే నష్టాలను మిగులుస్తాయి. కానీ రెండు సినిమాలు మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలు మిగల్చడమే కాకుండా వారిని కోలుకోనీయకుండా చేశాయి. ఆ సినిమాలు ఎవరివి? ఎవరు నటించారు? నిర్మాత, దర్శకులు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.
మొదటి స్థానంలో నిలిచిన రాధేశ్యామ్
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఇండియాలోనే నెం.1 హీరో. ఎన్నో రికార్డులు తన పేరుమీద ఉన్నాయి. అలాగే రెండు చెత్త రికార్డులను కూడా తన పేరుమీద డార్లింగ్ లిఖించుకున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజాహెగ్డే సరసన ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం 2022లో విడుదలైంది. ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. నిర్మాతకు రూ.200 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దర్శకుడికి ఎటువంటి అవకాశాలు రాకుండా చేసింది. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ మార్కెట్ అంతర్జాతీయంగా పెరిగింది. అందుకు తగినట్లుగా ఖర్చుపెట్టి, సినిమా తీసి విడుదల చేస్తే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ప్రభాస్ సొంత బ్యానర్లు యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ కలిసి రాధేశ్యామ్ ను నిర్మించాయి.

రెండో స్థానంలో నిలిచిన రాజాసాబ్
ఈ సినిమా తర్వాత మరో భారీ నష్టాన్ని తెలుగు సినీ పరిశ్రమకు అందించింది కూడా ప్రభాసే. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మించిన ది రాజాసాబ్ సినిమా అత్యంత బ్లాక్ బస్టర్ ఫ్లాప్ అయింది. మారుతి దర్శకత్వం అనగానే డార్లింగ్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకున్నారు. విశ్వప్రసాద్ ను ఆదుకునేందుకు ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకుంటే ఇది కూడా ఫ్లాపై నిర్మాతను మరింత నష్టాల్లోకి నెట్టింది. ది రాజాసాబ్ సినిమా రూ.170 కోట్ల నష్టాలను మిగిల్చి తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.












Click it and Unblock the Notifications