మహేష్ బాబు సినిమా వల్లే నా కెరీర్ క్లోజ్.. కానీ !!

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది నటి "రాశి". చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ని అలరించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా పలు సినిమాల్లో చేసింది ఈ సీనియర్ నటి.

ప్రస్తుతం మళ్లీ తెరపై రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. పలు సినిమాలతో పాటు సీనియల్స్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకే ఒక్క సినిమా వల్ల తన కెరీర్ నాశమైందని చెప్పుకొచ్చింది. తర్వాత సదరు డైరెక్టర్ క్షమాపణలు చెప్పినా కూడా తాను ఒప్పుకోలేదని ఓపెన్ అయ్యింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

tollywood-senior-actress-raashi-comments-about-nijam-movie-and-director-teja

రాశి ఏమన్నారంటే..

దర్శకుడు తేజ - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా "నిజం". తేజ తనను ఆ సినిమా కోసం పిలిచి, గోపీచంద్ పాత్ర తనదని.. మహేష్ బాబు తర్వాత వస్తారని కథ చెప్పినప్పుడు వివరించారు. డైరెక్టర్ కోరిక మేరకు బరువు తగ్గి, లెన్స్‌లు పెట్టుకున్నానన్నారు. మేకప్ లేకుండా కేవలం లిప్‌స్టిక్, కాజల్‌తో నేచురల్ గా నటించానని వెల్లడించారు. కానీ షూటింగ్ మొదటి రోజునే తనకు చెప్పని ఒక అభ్యంతరకరమైన సన్నివేశాన్ని చిత్రీకరించారని వాపోయారు.

ఆ ఒక్క సన్నివేశం తన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని ఆ సీన్ చేయడానికి నిరాకరించానని రాశి పేర్కొన్నారు. తన పి.ఆర్.ఓ. బాబూరావుతో సహా చాలా మంది తనను ఒప్పించడానికి ప్రయత్చడంతో.. చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత తేజ తనకు క్షమాపణలు చెప్పారని.. కానీ ఆ క్షమాపణలు తన కెరీర్ నష్టాన్ని పూడ్చలేవని స్పష్టం చేశారు. అందుకే ఆ సినిమా తర్వాత తాను సినిమాలు చేయలేదని.. అదే తన సినీ కెరీర్ లో మైనస్ అని చెప్పుకొచ్చారు. కానీ తేజ దర్శకత్వంలో వచ్చిన కేక, లక్ష్మీ కళ్యాణం వంటి సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పానని రాశి అన్నారు. ఇండస్ట్రీలో తాను మర్చిపోవాలనుకునే డైరెక్టర్ తేజ అని అన్నారు.

tollywood-senior-actress-raashi-comments-about-nijam-movie-and-director-teja

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "వారణాసి" మూవీ చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+