Sheikh Hasina: అరెస్టవుతా లేదా చచ్చిపోతా..! బంగ్లా రిటర్న్ ఎప్పుడో తేల్చేసిన షేక్ హసీనా..!

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో తలెత్తిన తిరుగుబాటులో పదవీచ్యుతురాలై, దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్ లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఎంతోకాలం ఇక్కడ ఉండేలా కనిపించడం లేదు. త్వరలోనే స్వదేశానికి వెళ్తానని ఇప్పటికే ప్రకటించిన ఆమె.. ఇవాళ తన తిరుగు ప్రయాణంపై మరింత స్పష్టత ఇచ్చారు. బంగ్లాదేశ్ కు డిసెంబర్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు షేక్ హసీనా వెల్లడించారు. తనతో పాటు తన పార్టీ అవామీ లీగ్ నేతలు కూడా బంగ్లాదేశ్ తిరిగి వెళ్తామన్నారు.

భారత్ కు బంగ్లా బిగ్ షాక్..! తాజా అల్టిమేటం..!
భారత్ కు బంగ్లా బిగ్ షాక్..! తాజా అల్టిమేటం..!

బంగ్లాదేశ్ లో తాను అడుగుపెట్టగానే అక్కడి పాలకులు తనను అరెస్టు చేస్తారని లేదా చంపేస్తారని, అయినా తాను తిరిగి వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్లు షేక్ హసీనా ప్రకటించారు. తన పార్టీ అవామీ లీగ్ నాయకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారి కోసం తాను స్వదేశానికి వెళ్లి తీరాల్సిందేనని హసీనా తెలిపారు. తనకు చావు అంటూ వస్తే అతి సొంత గడ్డ మీదే రావాలని, తన తల్లితండ్రులు చనిపోయిన చోట, రక్తం చిందించిన చోటే రావాలని కోరుకుంటున్నట్లు హసీనా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

Sheikh Hasina Announces Bangladesh Return Timeline Says Prepared for Arrest or Death
భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!
భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో తలెత్తిన విద్యార్ధుల తిరుగుబాటు సందర్భంగా వారిని అణచివేసే క్రమంలో హసీనా ఇచ్చిన ఆదేశాలు ఆమె మెడకు చుట్టుకున్నాయి.బంగ్లాదేశ్ కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఈ కేసులో ఆమెను ఇప్పటికే దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అప్పటి తిరుగుబాటు సందర్భంగా హసీనా విద్యార్ధుల్ని చంపేందుకు ఆదేశాలు ఇచ్చారని, వాటిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని, తిరుగుబాటు దారుల్ని ఉక్కుపాదంతో అణచివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయా కేసుల్లో హసీనాకు మరణశిక్ష విధించే ప్రమాదం పొంచి ఉంది. అయినా హసీనా స్వదేశానికి వెళ్లాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+