Sheikh Hasina: బంగ్లాదేశ్ వెళ్లిపోతా -షేక్ హసీనా కీలక ప్రకటన..!

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో తలెత్తిన జెన్ జీ తిరుగుబాటు తర్వాత దేశం వదిలి భారత్ కు తరలివచ్చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) అప్పటి నుంచీ మన దేశంలో ప్రవాసంలో ఉంటున్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ లో సానుకూల సంబంధాలు నెరిపిన చరిత్ర ఉన్న హసీనాను మన ప్రభుత్వం శరణార్దిగా పరిగణించి ఆశ్రయం ఇచ్చింది. బంగ్లాదేశ్ లో ఆమెపై పలు కేసులు ఉన్నా, వాటి విచారణ కోసం ఆమెను అప్పగించాలని అక్కడి ప్రభుత్వం కోరినా భారత్ మాత్రం పట్టించుకోలేదు. అయితే హసీనా ఇప్పుడు స్వదేశం తిరిగి వెళ్లడంపై క్లారిటీ ఇచ్చారు.

భారత్-బంగ్లా మధ్య మరో చిచ్చు..! ప్రధాని సలహాదారు స్క్రీనింగ్-రాయబారికి సమన్లు..!
భారత్-బంగ్లా మధ్య మరో చిచ్చు..! ప్రధాని సలహాదారు స్క్రీనింగ్-రాయబారికి సమన్లు..!

ప్రస్తుతం షేక్ హసీనా గతంలో తాను చేసిన నేరాలపై బంగ్లాదేశ్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అలాగే ఆమె పార్టీ అవామీ లీగ్ పై బంగ్లాదేశ్ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాదే స్వదేశానికి తిరిగి వెళ్లిపోతానని తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె వెల్లడించారు. తన పార్టీ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అదొక శక్తి అని ఆమె స్పష్టం చేశారు. మైనారిటీలపై ఎలాంటి దాడి అయినా బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై దాడితో సమానమని హసీనా తేల్చిచెప్పారు. దేశవ్యాప్త నిషేధాన్ని ధిక్కరిస్తూ అవామీ లీగ్ తాజాగా తన 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా డజన్ల కొద్దీ కార్యకర్తలు అరెస్టు అయ్యారు.

Sheikh Hasina Exile 2026 I Will Return This Year Bangladesh s Former PM Speaks Out
భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!
భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!

తన తిరుగు ప్రయాణం అనేది వ్యక్తిగత ఆశయానికి సంబంధించిన విషయం కాదని, ఇది బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, చట్ట పాలన, మన విముక్తి పోరాట స్ఫూర్తి వంటి అత్యంత కీలకమైన అంశాలతో ముడిపడి ఉందని ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో హసీనా తెలిపారు. తాను అధికారం కోసం రాజకీయాలు చేయనని, బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం, 'సోనార్ బంగ్లా' (సువర్ణ బంగ్లా)ను నిర్మించాలన్న జాతిపిత బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కలను సాకారం చేయడం కోసం రాజకీయాలు చేస్తానని తెలిపారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు న్యాయమైనది కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+