పుట్టబోయే ప్రతి బిడ్డకు గోల్డ్ రింగ్: సంచలన ప్రకటన చేసిన సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్ పరిపాలనలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇక తాజాగా "తాయిమామన్ తంగా మోతిరామ్ తిట్టమ్" పథకంపైనా సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో రూ. 755.83 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ పథకం జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన బిడ్డలకు వర్తిస్తుంది.
తాయిమామన్ తంగా మోతిరామ్ తిట్టమ్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కసరత్తులు పూర్తి చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కోసం ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ యూనిట్ పేరుతో పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. అన్నామలై జన్మదినం సందర్భంగా ఈ పథకం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన బిడ్డలకు రూ. 13,600 విలువైన బంగారు ఉంగరాన్ని అందించనున్నారు. తమిళనాడు సంస్కృతిలో భాగమైన సంప్రదాయం ప్రకారం.. అప్పుడే పుట్టిన బిడ్డకు మేనమామ ఓ బహుమతిని తీసుకొస్తాడు. ఈ పథకం ప్రకారం సీఎం విజయ్ ఆ పసి పిల్లలకు మేనమామ అని సంకేతాన్నిస్తూ వారి కుటుంబంలో సంతోషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ అంచనాల ప్రకారం సరాసరి 7.8 లక్షల మంది చిన్నారులు ఏటా రాష్ట్రంలో జన్మిస్తున్నారు. వీరిలో ఆస్పత్రిలో జన్మించిన వారి శాతం 99.9 గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-6) వెల్లడించింది.

వీరిలో ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన వారి సంఖ్య 4.2 లక్షలుగా ఉంది. అంటే మొత్తం మందిలో దాదాపు 53 శాతం మంది. ఇక వైద్య ఖర్చు ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం రూ. 1,364 గా ఉండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ ఖర్చు రూ. 63, 473 గా ఉంది. ఇక ఈ పథకం అమలుకు మహిళలు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డలకు జన్మనిచ్చి ఉండాలి. రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఆధార్, ఐడీ కార్డు సమర్పించాలి. మొత్తానికి ఈ పథకం అమలుతో తమిళనాడులో మహిళల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతకు సీఎం విజయ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లుగా భావించాలి.












Click it and Unblock the Notifications