చంద్రమోహన్ గురించి తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలు
హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా విభిన్నమైన పాత్రలను పోషించిన మల్లంపల్లి చంద్రశేఖర్ రావు (చంద్రమోహన్) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
1945 మే 23వ తేదీన కృష్ణాజిల్లాలో జన్మించిన చంద్రమోహన్ ఇప్పటివరకు 200 పైగా సినిమాల్లో హీరోగా, 900 సినిమాలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. 1966లో రంగులరాట్నం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు.
ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించారు. అప్పుడే హీరోయిన్లుగా రంగ ప్రవేశం చేసిన జయప్రద, శ్రీదేవి సినిమాల్లో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. సిరిసిరిమువ్వలో చంద్రమోహన్ తనదైన పాత్ర పోషించి గుర్తింపు సాధించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. 2005 సంవత్సరంలో అతనొక్కడే సినిమాకు గాను నంది పురస్కారం లభించింది. 2021 సంవత్సరంలో తెలుగు బుక్ ఆఫ్ ది రికార్డ్ లో చోటు దక్కింది. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పొందారు. 2000 సంవత్సరం నుంచి చంద్రమోహన్ ఉత్తమ సహాయ నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా హాస్యనటుడిగా మంచి పేరు సంపాదించారు.

రంగుల రాట్నం తర్వాత బంగారు పిచ్చుక, ఆత్మీయులు అనే రెండు సినిమాలు ఆయనలో ఉన్న మంచి నటుడిని వెలికి తీశాయి. బొమ్మ బొరుసు అనే సినిమాతో 1971లో మరోసారి మంచి గుర్తింపు సాధించారు. ఇదే సంవత్సరంలో రామాలయం, లాల్ పత్తర్ అనే రెండు సినిమాల ద్వారా మరోసారి తన నటనను నిరూపించుకోవడంతోపాటు 1975లో యశోద కృష్ణ అనే సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.












Click it and Unblock the Notifications