విద్యార్ధులకు సుప్రీం బిగ్ రిలీఫ్..! రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!

నీట్ పరీక్ష లీకేజీలకు బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ రోడ్లెక్కిన విద్యార్ధులు వివిధ రాష్టాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున విద్యార్ధుల్ని పోలీసులు నిర్బంధించారు. వీరిని తక్షణం వీడుదల చేయాలని ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై ఒత్తిడి పెంచడంతో అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాలు ఈ దిశగా ఆదేశాలు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయా కేసుల్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు (Supreme Court) కూడా రాష్ట్రాలకు మరో ఆదేశం ఇచ్చింది.

నిరసనల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన 18 లోపు ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్ధులను తక్షణం విడుదల చేయాలని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలీసుల్ని నిరసన ఘటనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని కూడా ఆదేశించింది. దీంతో ఆయా ప్రభుత్వాలు ఇప్పుడు తప్పనిసరిగా 18 ఏళ్ల లోపు విద్యార్ధులను నిర్బంధం నుంచి విముక్తి కల్పించబోతున్నాయి.

Supreme Court Orders Release of Student Protesters Below 18 Without Criminal History

జూలై 20న ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన విద్యార్ధుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిపై తీవ్ర సెక్షన్లతో కేసులు కూడా నమోదు చేసారు. అలాగే ఈ ఆందోళనల్లో నేరచరిత్ర ఉన్న వారు కూడా భారీ సంఖ్యలో పాలుపంచుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీంతో ఎలాంటి నేరచరిత్ర లేని, 18 ఏళ్ల లోపు వారిని మాత్రమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+