మెగా అభిమానులకు ఉపాసన అదిరిపోయే కౌంటర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఆచార్య వంటి డిజాస్టార్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక రామ్ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. వచ్చే డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ''జరగండి'' సాంగ్ పెద్ద హిట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ సినిమా గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని మెగా అభిమానులు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, రామ్ చరణ్ పెట్ రైమ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ వచ్చింది. అయితే మెగా ఫ్యాన్స్ రైమ్ మీ డాడిని అడిగి గేమ్ ఛేంజర్ అప్డేట్ చెప్పు అని కామెంట్స్ చేశారు.ఆ మెసేజ్ చూసిన ఉపాసన అదిరిపోయే కౌంటర్ వేసింది. ''రైమ్ మీకు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఎలా చెప్తుంది.
ఈ సినిమాకు నిర్మాత లేదా దర్శకురాలు కాదు కదా'' అని రిప్లై ఇచ్చింది. అలాగే ఓ స్మైలీ ఎమోజీ షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు అభిమానులకు కౌంటర్ ఇచ్చారనే చర్చించుకుంటున్నారు.భారతీయుడు -2 రిజల్ట్ చూసిన తర్వాత గేమ్ ఛేంజర్ ఇప్పట్లో విడుదల చేయవద్దని వేడుకుంటున్నారు. భారతీయుడు -2 రిజల్ట్ ప్రభావం ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. దీనికి తోడు శంకర్ తన మార్క్ చూపించకపోవడంతో గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పట్లో విడుదల చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications