నా కాన్ఫిడెన్స్ వాడికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? ట్రోలర్స్‌కి విజయ్ దేవరకొండ కౌంటర్

ఇటీవలి కాలంలో సినిమాలు, హీరోలు, హీరోయిన్లను వ్యక్తిగతం టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. కొందరు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. తనపై గత కొంతకాలంగా జరుగుతున్న ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సీరియస్ అయ్యారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న రణబాలి సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చారు.

చాలామందికి రాని స్టార్‌డమ్ మీకు చాలా చిన్న వయసులోనే వచ్చేసింది. ఒక యాక్టర్‌గా మీకు వచ్చినంత హేట్ ఏ హీరోకి రాలేదని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ఇప్పుడే రవిగారు కూడా మాట్లాడారు. నా కలలు, నా శ్రమ వాడికి అనవసరం అనిపిస్తే నేను ఆగాలా? నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాడికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? నా జర్నీ వాడికి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? నేను మారను వాళ్లే మారాలి. వాళ్ల గురించి, వాళ్ల ఫ్యామిలీ గురించి, వాళ్లకు పుట్టబోయే బిడ్డల గురించి ఆలోచిస్తే మంచిది. సక్సెస్ స్టోరీస్‌ని సినిమాల్లో చూడటం, డాక్యుమెంటరీస్‌లో చూడటం, పర్సనల్ లైఫ్‌లో కలవడం నేను చాలా ఎంజాయ్ చేశా. ఒకడు సక్సెస్ అయితే వాడి చుట్టూ ఫ్యామిలీస్, వాళ్ల ఫ్రెండ్స్, పిల్లలు, సొసైటీ అంతా చాలా బాగుంటుంది. ఎప్పుడూ వెనకాల మాట్లాడే పనులు చేస్తే ఎటు పోతామో అని విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు.

Vijay Deverakonda Slams Online Trolling Says Manufactured Groups Are Targeting Ranabaali

ఇది 90 పర్సెంట్ కొన్ని మాన్యుఫాక్చర్డ్ గ్రూపులుంటాయి. ఒక 50 మంది కూర్చొని ఇరవై, ముప్పై మంది అకౌంట్‌లు పెట్టుకుని చేస్తున్నారు. రణబాలిని బ్రిటీష్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సడెన్‌గా 50 రీళ్లు తెలుగు సినిమాయేనా? రణబాలికి ఏం వెళ్తాం.. జైలర్‌కి పోదాం, ఈ సినిమా బొక్క అని ఓ 50, 60 రీల్స్ తిరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ 50 రీళ్లలో ఒకే కమ్యూనికేషన్ చూస్తున్నామంటే ఎవడో డబ్బులు పెట్టి బ్యాచ్‌ని కూర్చోబెట్టి చేయిస్తున్నాడు. ఈరోజు ప్రపంచం అలా మారిపోయింది.. ఇది ప్రతి ఒక్క యాక్టర్‌కి జరుగుతుంది, రాజకీయ నాయకులకు జరుగుతోంది సిస్టమ్ అలా తయారైందని విజయ్ దేవరకొండ వాపోయారు.

వచ్చే 6 నెలలు వీళ్ల పని ఏఐతో చేయించేస్తారు.. మరి ఇలా ట్రోల్ చేసే వారి పరిస్ధితి ఏంటీ? హేట్ అని మనం ఫీల్ అవ్వొద్దు.. ఏ సినిమా అయినా, ప్రొడక్ట్ అయినా ప్రమోట్ చేయడానికి మేం ఫుల్‌గా సపోర్ట్ చేస్తాం. కానీ సేమ్ టూల్‌ని ఎవరినో కిందకి లాగడానికి వాడుకున్నప్పుడే ఎందుకురా ఈ పనికిరాని పనులు అనిపిస్తుంది. కానీ అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. దీనిపై నాని అన్న, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం వంటి వాళ్లతో పాటు నా ముందు వచ్చిన వాళ్లు.. వెనుక వచ్చినవాళ్లు కూడా మాట్లాడారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ తెలియదు.. నాకు ఏం జరుగుతుందో తెలియడానికి ఏడేళ్లు పట్టింది. నేను ఖాళీ చేతులతో వచ్చి సినిమాలంటే ఇష్టం.. సినిమాలు తీస్తా, నచ్చిన స్క్రిప్ట్‌లు తీసుకోవచ్చని ఊపుకుంటూ వచ్చా. కానీ గతేడాది నుంచి ఏం జరుగుతుందో ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ల దగ్గర తుపాకులు ఉన్నాయి.. మనమేమో ఖాళీ చేతులతో ఉన్నాం. మీడియా దీనిని జనంలోకి తీసుకెళితే దీని మీద అవగాహన వస్తుందని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+