మెగా ఫ్యామిలీకి వైసీపీ కౌంటర్... నువ్వెంత?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సినీ రంగానికి చెందిన పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించడమే కాకుండా పార్టీ తరఫున పోటీచేసిన 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. పవన్ ను పిఠాపురం నుంచి ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ 70వేల పైచిలుకు మెజారిటీతో సంచలన విజయాన్ని కైవసం చేసుకున్నారు.
ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో మెగా హీరోలకు, వైసీపీ సోషల్ మీడియా విభాగం మధ్య యుద్ధం నడుస్తోంది. తాజాగా సాయిధరమ్ తేజ్ ఏపీ భద్రమైన చేతుల్లో ఉందని (సేఫ్ హ్యాండ్స్ ఓ ఉందని) ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు, నేరాలు జరుగుతుంటే అవన్నీ కనడటంలేదా? వాటిపై ఎందుకు స్పందించడంలేదంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ లో పోస్టులు పెడుతోంది. దీంతో వీరికి ధీటుగా సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఎగ్ పఫ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎగ్ పఫ్ లకోసం మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుకుతెస్తూ సాయి ధరమ్ తేజ్ ఎగ్ పఫ్ ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఇలా రెండు వర్గాల మధ్య యుద్ధం నడుస్తున్న క్రమంలో సాయి ధరమ్ తేజ్ కు మద్దతుగా జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పకొడుతూ ఆపార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగం చేసిన తీరును ఎండగడుతున్నారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ? తణుకులో అన్న క్యాంటిన్లలో మురికినీటిలో ప్లేట్లు కడిగారనగా.. ఎగ్ పఫ్స్ బిల్లు బాగా ఎక్కువైందని, మీరు బాగా తినివుంటారంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మాత్రం వచ్చిన ట్వీట్లకు రిప్లై ఇవ్వడం మానేశాడు. ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులకు, వైసీపీ సోషల్ మీడియా విభాగానికి మధ్య యుద్ధం నడుస్తుందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications