కనపడటంలేదు.. అడ్రస్ తెలిస్తే చెప్పగలరు!
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత దాదాపు 14 సంవత్సరాల విరామంతో గుంటూరు కారం వచ్చింది. సినిమాకు ముందు త్రివిక్రమ్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. విడుదలైన తర్వాత అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అతడు, ఖలేజా సినిమాలు ఈరోజుకు టీవీల్లో ప్రసారమవుతుంటే కళ్లప్పగించి చూస్తుంటారు. కానీ గుంటూరు కారంను అలా కూడా చూడరని ప్రిన్స్ అభిమానులు మండిపడుతున్నారు.
గుంటూరు కారం సినిమా ప్లాప్ కావడంతో మహేష్ బాబు - త్రివిక్రమ్ మధ్య వివాదాలు ముదిరాయంటున్నారు. ఈరోజు వరకు ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్లకు త్రివిక్రమ్ హాజరుకావడంలేదు. త్రివిక్రమ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మాటల మాంత్రికుడు ఎవరికీ కనిపించడంలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో, డైరెక్టర్ మధ్య మాట మాట పెరిగి గొడవలైనట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ఈసారి భారీ ఫ్లాప్ ఇచ్చాడంటూ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో కనీసం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఒక్కటి కూడా లేదు. సంగీతం సోసో అని చెప్పాలి. తర్వాత సినిమాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత అల్లు అర్జున్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు కారం సినిమా ఫ్లాపవడంతో త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా? లేదంటే అట్లీతో చేస్తాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications