దేవర షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వనున్న యంగ్ టైగర్.. ఎందుకో తెలుసా?
దేవర షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వనున్న యంగ్ టైగర్.. ఎందుకో తెలుసా : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్. ఇక, ఈ సినిమా తర్వాత ఎన్‌టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రీలిజయిన ఈ సినిమా పిక్స్, టీజర్ ఎన్‌టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు దేవర షూటింగ్‌కు తారక్ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే దేవర చిత్రీకరణకు బ్రేక్ ఇస్తున్నట్లు టీ టౌన్ వర్గాల్లో టాక్. సుమారు ఒక నెల రోజుల పాటు తారక్ అక్కడే ఉండనున్నారనే న్యూస్ తెగ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం, కియారా అద్వానీ, శార్వరి కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో జూనీయర్ ఎన్‌టీఆర్ సైతం నటించనున్నాడు. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు ఎన్‌టీఆర్.

ఇక, ఈ సినిమా కోసమే తారక్ ముంబై వెళ్లనున్నట్లు సమాచారం. వార్ 2 సినిమా కోసం ఎన్‌టీఆర్ 60 రోజులు డేట్స్ ఇచ్చారట. వీటిలో నెలరోజులు తన సీన్స్ కోసం అయితే, మరో 30 రోజులు హృతిక్ తో కలిసి తారక్ సీన్స్ చేయనున్నారట. ఏప్రిల్‌లో ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో తారక్ అడుగుపెట్టనున్నారట. ఇక, ఈసినిమాలో తారక్ పూర్తి నెగిటివిటీలో కనిపించనున్నారట. టైగర్, పఠాన్, మేజర్ కబీర్ లా ఎన్టీఆర్ పాత్రను కూడా SRF స్పై యూనివర్స్ లోకి తీసుకురాబోతున్నారని సమాచారం.
వార్ 2 షూటింగ్‌లో అడుగుపెట్టనున్న తారక్ : ఇక వార్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. ఇప్పటికే హృతిక్ తోపాటు మిగతా సభ్యులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు తారక్ కూడా ఈ మూవీ సెట్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందుకే ఈ సినిమా డేట్స్ కోసం దేవర సినిమాకు తారక్ కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమాలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications