Fact Check: ఏపీలో కరవును ప్రభుత్వం పట్టించుకోవడం లేదా ? వాస్తవాలేంటి ?

ఏపీలో తీవ్ర కరవు పరిస్దితులు నెలకొన్నాయని, అయినా వాటిపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ, కేంద్రానికి నివేదికలు పంపడం కానీ చేయడం లేదని తాజాగా రాష్ట్రంలో విపక్షాలు, కొన్ని మీడియా సంస్ధలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్ధితులపై ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇందులో తాము కరవుపై తీసుకుంటున్న చర్యల్ని స్పష్టంగా వివరించింది.

సాధారణంగా ఒక ప్రాంతంలో కరువు ఉందా? లేదా? అని చెప్పడానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన ప్రమాణాలు ఉంటాయి. భారత వాతావరణ శాఖ నుంచి లభ్యమయ్యే వర్షపాతం తదితర వివరాల ఆధారంగా ఆయా ప్రభుత్వాలు నిర్ధారణకు వస్తాయి. కరువును నిర్ధారించడానికి అనుసరించే ప్రమాణాలు గత ప్రభుత్వానికైనా, ఈ ప్రభుత్వానికైనా, దేశంలో ఏ ప్రభుత్వానికైనా ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు కరువును దాచేస్తున్నారంటూ జనాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని ప్రభుత్వం తెలిపింది.

Fact Check: does ysrcp government ignore drought in andhra pradesh?

కరవు నిర్ధారణకు పలు సూచీలు ఉంటాయి. ఇందులో వర్షపాతం, పంటల విస్తీర్ణం, ఆ ప్రాంతంలో వృక్షజాతుల పరిస్థితులు, భూమిలో తేమ ఉందా? లేదా? నీటివనరుల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను పరిశీలిస్తారు. తర్వాత క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు చేస్తారు. వీటిని పరిగణలోకి తీసుకుని కరువు మండలాలను నిర్ధారిస్తారు. దీనికోసం కేంద్ర వాతావరణ శాఖ సహా వివిధ విభాగాల గణాంకాలను పరిగణలోకి తీసుకుంటారు. గత ప్రభుత్వానికైనా, ఈ ప్రభుత్వానికైనా, లేదా దేశంలో ఏ ప్రభుత్వానికైనా ఇవే ప్రమాణాలు ఆధారం.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లను ఈ వివరాల ఆధారంగా కరువు ప్రాంతాలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని 103 మండలాల్లో కరువు ఉన్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. 80 మండలాల్లో తీవ్ర కరువు ఉన్నట్టుగా, 23 మండలాల్లో మోస్తరు కరువు ఉన్నట్టుగా నిర్ధారించింది. జిల్లాలా వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో 24, నంద్యాల జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 28, శ్రీ సత్యసాయి జిల్లాలో 21, అన్నమయ్య జిల్లాలో 18, చిత్తూరులో 4, ఎన్టీఆర్‌ జిల్లాలో 2 మండలాలు కరువు బారినపడినట్టుగా తేల్చారు.

అలాగే కరవు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని ప్రారంభించింది. కరువు ఆర్థిక సహాయంపై రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 14నే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కరువు వల్ల జరిగిన నష్టం పూర్తి వివరాలను నివేదించింది. కరువు బాధిత ప్రాంతాల్లో సత్వర చర్యల కోసం వెంటనే రూ.688 కోట్ల సాయం కోసం విన్నవించింది. దీన్ని రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పశుగ్రాసం, తాగునీరు అందించడానికి వాడాల్సి ఉందని తెలిపింది. అలాగే సీఎం జగన్ ఈ ఏడాది జనవరి, మార్చి, ఏప్రిల్‌, మేలో, జూలై, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరవుపై సమీక్షలు జరిపారు. ఇప్పటికీ సమీక్షలు చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో పంట నష్టాన్ని నివారించడానికి పంటకోత ప్రయోగాలు పారదర్శకంగా చేయాలని, నష్టపోయిన ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేలా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలు రాగానే ఆ మేరకు వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులకు పరిహారం చెల్లించనున్నారు. అలాగే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులను వైయస్సార్‌ ఉచిత బీమా ద్వారా అదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విత్తనాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసింది. తాము ఈ స్ధాయిలో చర్యలు చేపడుతుంటే కరవును విస్మరిస్తున్నారని ప్రచారం చేయడం తగదని తెలిపింది.

Fact Check

వాదన

ఏపీలో కరవు పరిస్దితుల్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది

వాస్తవం

ఏపీలో కరవు మండలాలు ప్రకటించారు, సమీక్షలు చేస్తున్నారు, కేంద్రానికి నివేదికలూ పంపారు. .

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+