Fact Check: వైజాగ్ లో కోవిడ్ తొలి మరణం-పాజిటివ్ గా నిర్ధారించాక !

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఒమిక్రాన్ ఉపరకమైన జేఎన్1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఇప్పటివరకూ రాష్టంలో కోవిడ్ మరణాలు మాత్రం నమోదు కాలేదని భావిస్తున్న క్రమంలో వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఓ మహిళ మృత్యువాత పడింది. కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఈ మహిళ చనిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా కోవిడ్ నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్న వైద్య వర్గాలు ఈ మహిళ మరణంపై స్పందించాయి.

వైజాగ్ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 51 ఏళ్ల బాదంపూడి సోమకళ అనే మహిళ చనిపోవడంతో రాష్ట్రంలో ఈసారి తొలి కరోనా మరణం ఇదేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ వేవ్ లో కరోనా కారణంగా మనుషులు చనిపోకపోవడంతో ఇదే నిజమనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీనిపై వైజాగ్ కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మహిళ కరోనాతో చనిపోయిందన్న ప్రచారంపై స్పందిస్తూ ఆమెకు కోవిడ్ సోకిందనే అంశాన్ని నిర్ధారించాయి.

Fact Check: Is the first covid 19 JN1 death in Andhra Pradesh in vizag?

తీవ్ర శ్వాససంబంధిత సమస్యలతో ఈ మహిళ ఈ నెల 22వ తేదీన వైజాగ్ ఛాతీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అలాగే ఆమె కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని, వివిధ అవయవాల సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించాయి. దీంతో ఆమెకు కోవిడ్ పరీక్ష కూడా నిర్వహించామని, ఇందులో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపాయి. అనంతరం ఆమెను ఈ నెల 24వ తేదీన డయాలసిస్ కోసం కేజీహెచ్ కు తీసుకొచ్చారని తెలిపాయి.

Fact Check: Is the first covid 19 JN1 death in Andhra Pradesh in vizag?

కేజీహెచ్ లో ఆమె శాంపిల్స్ తీసుకుని కరోనా జీనోమ్ నిర్ధారణ కోసం విజయవాడలోని సెంట్రల్ ల్యాబ్ కు పంపామని తెలిపారు. వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అయితే ఆలోపు ఆమెను రక్షించడానికి తాము తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో ఈ నెల 26న తెల్లవారుజామున 3 గంటలకు ఆమె చనిపోయినట్లు నిర్ధారించామన్నారు. అయితే ఈ మరణం కోవిడ్ వల్ల మాత్రమే జరిగింది కాదని, ఆమెకు ఉన్న ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యల వల్ల అని నిపుణులు వెల్లడించారు.

Fact Check

వాదన

వైజాగ్ కేజీహెచ్ ఆస్పత్రిలో కోవిడ్ 19తో మహిళ మృతి

వాస్తవం

వైజాగ్ కేజీహెచ్ లో మహిళకు కోవిడ్ నిర్ధారణ అయినా మరణానికి అదొక్కటే కారణం కాదు.

రేటింగ్

Mostly True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+