Fact Check:కూటమి పై చంద్రబాబు కామెంట్స్..డీప్ ఫేక్ టెక్నాలజీ వాడారన్న టీడీపీ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా రెండు ప్రధాన పార్టీల వారు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విమర్శలు అనేది సర్వసాధారణమైనప్పటికీ అవి నిర్మాణాత్మకంగా ఉండటం లేదు. హద్దులు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నాయి. మరోవైపు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో లేనివి ఉన్నట్లుగాను, ఉన్నవి లేనట్లుగాను చిత్రీకరిస్తున్నారు. ఇది ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో వైరల్‌గా కూడా మారుతున్నాయి. తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన టీడీపీ అధినేత చంద్రబాబు పడ్డారు. వన్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ చేసింది.

ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీయేలో భాగస్వామ్యం అవడం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు కూటమి గురించి మాట్లాడుతూ తాను అనని మాటలను అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా చిత్రీకరించిందని వాపోయింది టీడీపీ.

Chandrababu fact check

డీప్ ఫేక్ టెక్నాలజీతో..

కొన్ని రోజుల క్రిత్రం ఓ హీరోయిన్ విషయంలో సంచలనంగా మారిన డీప్‌ఫేక్ టెక్నాలజీనే చంద్రబాబు విషయంలో కూడా వినియోగించారని టీడీపీ వివరించింది. కూటమితో తన పార్టీ కలయిక తాత్కాలికమే అని చంద్రబాబు అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపించింది.

స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి దీనిపై స్పష్టత ఇచ్చారు. తాను చెప్పనిది చెప్పినట్లుగా వైసీపీ సోషల్ మీడియా చిత్రీకరిస్తోందని ఇంతకంటే దారుణం మరొకటి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాదు తన పేరుతో తన సంతకంతో కూడిన ఒక తప్పుడు లేఖను సృష్టించి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.వైసీపీ ట్రాప్‌లో పడొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక తాను ఒరిజినల్‌గా మాట్లాడిన మాటలు, డీప్‌ఫేక్ టెక్నాలజీ వినియోగించి విడుదల చేసిన ఫ్యాబ్రికేటెడ్ వీడియోను టీడీపీ విడుదల చేసింది.

Fact Check

వాదన

బీజేపీతో టీడీపీ కలవడం తాత్కాలికమే అని చంద్రబాబు చెప్పారు.

వాస్తవం

బీజేపీతో టీడీపీ పొత్తు తాత్కాలికమే అనే మాట చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+