• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Array

By Staff
|

మరోసారిమావోయిస్టుల గురించి మాట్లాడుకోకతప్పని పరిస్థితి. మానాల ఎన్‌కౌంటర్‌కునిరసనగా మావోయిస్టులు మార్చి 10నరాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఇచ్చిన పిలుపుపాక్షికంగా, ప్రశాంతంగా ముగిసింది.మానాల ఘటన మావోయిస్టులకు బాధకలిగించేదే. కాని ఎవరూ అనలేరు.అయితే ఆ సంఘటనకు ప్రతీకారంగాబస్సులను దగ్ధం చేయడం, ఎస్‌టిడిబూత్‌లను కాల్చి వేయడం విడ్డూరంగాఉంది. అంతేగాక ఆ సంఘటనకు ఏ రకంగాసంబంధం లేని రంగారెడ్డి జిల్లాకాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు పాపిరెడ్డినిపట్టపగలు అందరూ చూస్తుండగానేమంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కాల్చిచంపడం దారుణం. బస్సులను, ప్రైవేట్‌ఆస్తులను దగ్ధం చేయమని,అమాయకులను హతమార్చమనిమావోయిస్టు నేతలు ఇచ్చిన హామీ అప్పుడేతుపాకి గొట్టంలోంచి వచ్చిన పొగలోకలిసిపోయింది. హామీలు, వాగ్దానాల విషయంలోమావోయిస్టులకు, మరొకరికి ఏ మాత్రంతేడా లేదని నిరూపించుకున్నారు.ఉరిమిఉరిమి మంగళం మీద పడ్డట్టుమావోయిస్టుల ఆగ్రహం అమాయకులపైఅప్రతిహతంగా కొనసాగుతోంది.నక్సల్స్‌ పగ - ప్రతీకారానికి టిఆర్‌యస్‌ యువజన నాయకుడుకిష్టయ్య బలయ్యాడు. మెదక్‌ జిల్లాలోకిష్టయ్య ప్రాణాలు కోల్పోగామహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు ఇప్పలపల్లిగ్రామంలో మావోయిస్టులు టెలిఫోన్‌ఎక్స్‌ఛేంజినీ దగ్ధం చేశారు. బస్సులు,టెలిఫోన్‌ ఎక్సేఛేంజీలను దగ్ధంచేయమని ఇచ్చిన మాట ఏమైనట్లు? ఎస్‌టిడిబూత్‌లు కూడా కొత్తగా మావోయిస్టులవిధ్వంసకాండ జాబితాలో చేరాయి. ఇకముందు ముందు ఏవేవి వారిదగ్ధకాండ జాబితాలో చేరుతాయోతెలియదు.ఈవిషయాన్ని కాసేపు పక్కన పెడితే... మార్చి9న బుధవారంనాడు రాజ్యసభలోసభ్యులు నక్సల్స్‌ ప్రధానంగామావోయిస్టులపై అడిగిన ప్రశ్నలకు,సందేహాలకు హోం మంత్రి శివరాజ్‌పాటిల్‌ సమాధానమిచ్చారు. హోం శాఖసహాయ మంత్రి ప్రకాశ్‌ జైస్వాల్‌సమాధానమిస్తూ నక్సల్స్‌నుఎదుర్కోవడానికి బహుముఖ వ్యూహం అమలుజరుపుతున్నట్టు చెప్పారు. ప్రధానంగాభద్రతా బలగాలను ఆధునీకరించడం,నిఘా వ్యవస్థను మరింతమెరుగుపరుచుకోవడం, అదేసమయంలో నక్సల్స్‌ ప్రభావితప్రాంతాల్లోని ప్రజల స్థితిగతులనుమెరుగుపచడానికి తగు చర్యలుతీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. అలాగేహింసను విడనాడితేనే నక్సల్స్‌తోచర్చలు జరుపుతామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్లు చర్యలనుంచి ఏకపక్షంగా వైదొలిగారని స్పష్టంచేశారు. నేపాల్‌ నుంచి బీహార్‌ మీదుగాఆంధ్రప్రదేశ్‌ వరకు మావోయిస్టులుకంపాక్ట్‌ రెవల్యూషనరీ జోన్‌ ఏర్పాటుచేస్తున్నారని దాని ప్రభుత్వం వమ్ముచేయనున్నదని తెలిపారు.అదేరోజు అంటే బుదవారంనాడు బీహార్‌గవర్నర్‌ బూటాసింగ్‌ మావోయిస్టులపైఒంటి కాలి మీద లేచారు. నక్సలైట్లపైఉక్కుపాదం మోపనున్నట్లు ఆయనప్రకటించారు. బీహార్‌ ప్రధానకార్యదర్శి కె. ఎ. హెచ్‌. సుబ్రహ్మణ్యం,హోం కమీషనర్‌ గరీష్‌ శంకర్‌తోబూటాసింగ్‌ సమావేశమైన తర్వాతఈ విషయం ప్రకటించారు. నేపాల్‌సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టులకార్యకలాపాలను అదుపు చేసేందుకుతగు చర్యలు తీసుకుంటున్నట్లు కూడాబూటాసింగ్‌ వెల్లడించారు.మరోసారిమానాల విషయానికొద్దాం..... కరీంనగర్‌ -నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోనిజోథ్యానాయక్‌ తండా సమీపంలో మార్చి 7నఎన్‌కౌంటర్‌ జరిగింది. పది మంది మావోయిస్టులుమరణించారు. ఇద్దరు లొంగిపోయారు. ఈసంఘటనపై అనేకానేక అనుమానాలువెల్లువెత్తాయి. అందులో ఏ వాదనసరైనదో ఇప్పుడప్పుడే తెలిసేఅవకాశం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇదిమావోయిస్టులస్వయంకృతాపరాధమనే భావనవినిపిస్తోంది. మరిస్వయంకృతాపరాధానికి ఇంత హింసజరగాలా? ఇన్ని బస్సులు దగ్ధం కావాలా?అమాయకులు ప్రాణాలు కాల్పోవాలా? లక్షలాదిమంది అసౌకర్యానికి గురి కావాలా?విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండాఉండాలా?మావోయిస్టులుప్రజల సమస్యల పరిష్కారానికివ్యూహరచన చేస్తున్నారా? లేక ప్రజలసమస్యలు పెరిగేందుకుపూనుకుంటున్నారా? అన్న ప్రశ్నల బలంపుంజుకుంటోంది. ప్రభుత్వంతో చర్చలుజరిపి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఓమార్గం వేస్తారని భావించిన వారి ఆశలపైవాళ్లు చన్నీళ్లు చల్లారు. ప్రజలసమస్యలను గాలికొదిలేసి ఆయుధాలు పట్టిఅడవుల్లో సంచరించడం వల్లసమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుంది?మావోయిస్టులుబాధ్యతాయుతమైన ఒక రాజకీయపార్టీగా గత సంవత్సరంసెప్టెంబర్‌లో ఆవిర్భవించారు. కాని ఆబాధ్యతను ఆచరణలో మాత్రంచూపడం లేదు. రాజకీయ పార్టీ ప్రజలజీవితాలు, వారి జీవన ప్రమాణాలుమెరుగుపడేందుకు పాటు పడుతుంది.కాని సిపిఐ (మావోయిస్టు) మాత్రం ప్రజలనుపట్టించుకోకుండా, ప్రజల ప్రమేయంలేకుండా ఆయుధాలతో,మందుపాతరలతో అడవుల్లో,అరణ్యాలలో, కొండకోనల్లో మకాం వేస్తేసమస్యలు ఎలా పరిష్కారమవుతాయోవారికే తెలియాలి. పరిష్కారం కాకపోగాఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.వాటితో ప్రజలుసతమతమవుతున్నారు.మావోయిస్టులుదేశంలోని 12 రాష్ట్రాలలో తమ ఉనికినిచాటుకున్నంత మాత్రాన ఆ 12 రాష్ట్రాలనువిముక్తి చేసే దశలో ఉన్నట్టుభావించడం, ఆ భావనలోకార్యాచరణనురూపొందించుకోవడంలో ఔచిత్యం ఏమీ లేదు.తమని తాము అతిగా ఊహించుకోవడమేఅవుతుంది. ఔచిత్యం కొరవడిన ఏకార్యక్రమమైనా ఎక్కువ కాలంమనజాలదు.అలాఅతిగా ఊహించుకొని మావోయిస్టులు మార్చి 11నచిలుకలూరిపేట పోలీసు స్టేషన్‌పైమెరుపుదాడి చేసి ఏడుగురినికిరాతకంగా చంపారు. మైదానప్రాంతంలో, అందులో జనసమ్మర్ధంఎక్కువగా ఉండే పట్టణంలోని పోలీసుస్టేషన్‌పై దాడి చేయడమంటేఅణచివేతను ఆహ్వానించడమేనన్నవిషయం అందరికీ తెలిసిందే. అంతేకాకనిషేధాన్ని విధించేందుకు బలమైనకారణం చూపేందుకు వీలుకల్పించినట్టయింది. ఆ మెరుపుదాడిలోదారుణంగా, ఇళ్లలోకి చొరబడిఅమాయకులను కాల్చి చంపడంతో ఆవేషప్రజల మనసుల్లో మావోయిస్టులపై ఏవిధమైన అభిప్రాయం కలుగుతుందోఎవరైనా ఊహించవచ్చు.మానాలసంఘటనకు ప్రతీకారంగా నెత్తుటిఅప్పు తీర్చుకుంటున్నామని నమ్మించడానికిఎంత ప్రయత్నం చేసినా మావోయిస్టులవైఖరి ఫాక్షనిస్టుల్లా మారిందనే అపనిందనుంచి తప్పించుకోలేకపోతున్నారు.మావోయిస్టులు అలాగే ప్రవరిస్తున్నారుకాబట్టి ప్రజలు అలాగే భావించడంలో తప్పేంఉంది? మావోయిస్టులను సమర్థించేవారేప్రజలు అన్న భ్రమ నుంచి మావోయిస్టులుముందుగా బయట పడాలి. అలా బయటపడి విశాలదృక్పథంతో ఆలోచిస్తే సమాజంలోని అనేకసమస్యలు అవగతమవుతాయి. వాటిపరిష్కారానికి పని చేయడం వల్ల వారి(ప్రజల) హృదయాలను ఆకర్షించడానికివీలవుతుంది. అంతేగాని అదే పనిగాహత్యలు, ఊచకోతలకు పాల్పడితే ఎవరుమెచ్చుతారు, ఎవరు నచ్చుతారు?చిలుకలూరిపేటసంఘటనతో రాష్ట్రంలో విప్లవపరిస్థితులు మెరుగయ్యాయా?విప్లవంలో మరింత మందినిమమేకం చేశారా? రైతులు, కూలీలు,శ్రమజీవుల జీవితాలు ఏమైనామెరుగుపడ్డాయా? ఏ విధమైన పాజిటివ్‌పాయింట్‌ ఒనగూరింది? ఏమీ లేదు. గెరిల్లాలఆత్మస్థైర్యం పెంచేందుకు ఆచర్యకు పాల్పడ్డామని మావోయిస్టులుచెప్పుకున్నా ఆ వాదనలో అంత బలంకనిపించదు. ఎందుకంటే గెరిల్లాలఆత్మస్థైర్యం పెంచడానికిప్రజావిజయాలు దోహదపడతాయి గానిప్రజల కన్నీళ్లు, కడగండ్లు, ఆర్తనాదాలుఉపయోగపడవు. సమాజంలో ఎంతఎక్కువమందిని విప్లవ పంథాలోకి తీసుకొస్తేఅంతగా గెరిల్లాల స్థైర్యంపెరుగుతుంది. వారిలో నూతనోత్సాహంవెల్లివిరస్తుంది. మరింత ముందుకుపోవడానికి ఉద్యుక్తులవుతారు. అంతేగానిఅణచివేతను, నిషేధాన్ని ఆహ్వానించే రీతిలోవ్యూహం, ఎత్తుగడలు ఉంటే గెరిల్లాలఆత్మస్థైర్యమే కాదు,సానుభూతిపరులు, ఇతర సెక్షన్లుకూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాయి.ఎవరైనా అపజయం వైపునడిచేందుకు త్యాగాలు చేయడానికిసిద్ధపడరు కదా! ఒకటి రెండుసార్లు అలా జరిగినా ఎప్పటికీ అలాగేజరుగుతుందని ఊహించడం సబబుకాదు.మావోయిస్టులప్రతీకార దాడి చిలకలూరిపేటతోనే ఆగింగా అంటేలేదు. రాష్ట్రవ్యాప్తంగావిధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది.మహబూబ్‌నగర్‌ జిల్లా తిరుమలాపూర్‌గ్రామానికి చెందిన చెంచు (గిరిజన)యువకుడు కోటయ్యను మావోయిస్టులుకాల్చి చంపారు. అదే జిల్లాలో మాజీనక్సలైట్‌ మల్లేశ్‌ను కల్వకుర్తిదళం హతమార్చింది. ఖమ్మం జిల్లాఇల్లందు బస్‌ స్టేషన్‌పై దాడి చేసి,స్టేషన్‌ పేల్చివేతకు విఫలయత్నం చేసిచివరకు ఐదు బస్సులను ధ్వంసంచేశారు. ఆదిలాబాద్‌ జిల్లా చింతలపూడి లింగాలగ్రామంలో మూడు టిప్పర్లను మార్చి13న దగ్ధం చేశారు. ఇదంతా ప్రజలజీవితాలను మెరుగుపరిచే విప్లవకార్యక్రమమని మావోయిస్టులుచెప్పదలుచుకున్నారా?

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more