డిసెంబర్ 19న పార్లమెంటులో తెలంగాణ బిల్లు

కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా బిల్లును రూపొందించారని, అయితే రాయల, తెలంగాణ అంశాన్ని ఇంకా సజీవంగానే ఉంచారని, తెలంగాణ బిల్లును నవంబర్ 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. బిల్లులో అంశాలపై శాసనసభ చర్చిస్తుంది. 10 జిల్లాల తెలంగాణ అని బిల్లులో ప్రస్తుతానికి పేర్కొన్నా, అది అసెంబ్లీ ముందుకు వచ్చేసరికల్లా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. బిల్లుపై ఒక వేళ అసెంబ్లీలో ఓటింగ్ అనివార్యమయ్యే పరిస్థితే గనుక తలెత్తితే దాన్ని నెగ్గించుకునేందుకు అవసరమైన మెజారిటీ కోసం ప్రభుత్వం ఈ మార్పులను చేయవచ్చు.
తెలంగాణ బిల్లును డిసెంబర్ 19న పార్లమెంటు ఆమోదం కోసం ప్రవేశపెడతారని ఢిల్లీ ఉన్నత వర్గాలు లీక్‌లను నడిపాయి. ఆ వెంటనే దాన్ని రాజ్యసభ ఆమోదానికి పంపుతారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అడుగుతున్న సమాచారమంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసమే ఇతర రాష్ట్ర విభజన విషయమును కేంద్రం తను అనుకొన్నట్లు చేసుకుపోతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలను, సమాచారాన్ని తీసుకున్నట్టుగా పైకి కన్పించాలనే ఉద్దేశంతోనే పార్టీల అభిప్రాయాలను కేంద్రం కోరుతోంది. ఈ తంతు మనదేశంలో ఆది నుంచి ఉన్నదే.
ప్రజాస్వామ్య ప్రక్రియ అన్నది జనాలను నమ్మించడానికి అనుసరించే ఉత్పత్తి ప్రక్రియ మాత్రమే. కొద్ది ఆధునికలతో రాచరికమై మన వద్ద కొనసాగుతున్నది. కొత్త రాష్ట్రంలో ఏ సమస్యను ఏ అథారిటీ ద్వారా పరిష్కారిస్తారో బిల్లులో పేర్కొనడంతో సరిపెడతారే తప్ప ఎలా పరిష్కరిస్తారో ఎక్కడా ఉండదని కూడా ఢిల్లీ వర్గాలు వివరించినట్లు వార్తలొస్తున్నాయి. ‘‘ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలేవైనా ఉంటే కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ పరిష్కారం చూపుతుంది. ఉద్యోగుల పంపిణీ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారి నేతృత్వంలో మరో అధికార కమిటీని నియమిస్తాయి. నీటి సమస్యలుంటే కేంద్ర జల సంఘం పరిష్కరిస్తుంది.
హైదరాబాద్ శాంతిభద్రతల సమస్యలను పోలీసులు పరిష్కరిస్తారు. ఆదాయం, అప్పుల పంపిణీ కోసం ఇంకో అథారిటీ ఏర్పరుస్తాం లాంటి అంశాలు బిల్లులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముందునుంచే వివరిస్తున్నట్లు విభజనను కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు సంకల్పించారు. కాబట్టి అది ఆగదు. వేగిరమే సాగిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో కేంద్రం మరింత బలపడుతుంది. రాష్ట్రాలు, రాష్ట్రాలలోని పాలక వర్గాలు బలహీనమౌతాయి. ఇది తనని తాను బలపరచుకోవడానికి ఢిల్లీ(కేంద్రం) చేపట్టిన చర్య. కాబట్టి ఏ అడ్డంకులు ఉండకపోవచ్చు. పార్లమెంటులో బిల్లు డిసెంబర్‌లో ఆమోదం పొందవచ్చు.
-దుర్గం రవిందర్
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications