ఆమ్ ఆద్మీ పార్టీ: ముందుంది ముళ్లబాట

కానీ, రానున్న రోజులలో కేవలం ఈ ఆదర్శవాదం - తాను వాగ్దానం చేసిన ఫలితాలను ప్రజలకు అందించగలదా అనేది ఇక్కడి అసలు ప్రశ్న. ఉదాహరణకు - అవినీతి అనేది నేడు సమాజంలో ఇంతగా ద్వేషించడానికి కారణం - నేడు అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు. కాబట్టి అవినీతికి మూలం అయిన ఈ విధానాలను ప్రశ్నించకుండా మౌలికంగా అవినీతిపై సమర్థవంతమైన పోరాటం సాధ్యం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి - పైపైన నోటి మాటగా కితాబులిస్తోన్న పలువురు కార్పోరేట్లు - ఈ అవినీతి అంశంపై లోలోపల ఆ పార్టీపై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంటే, అవినీతిని పెంచి పోషించే కార్పోరేట్లు వాటి ద్వారా లబ్ధి పొందే కార్పోరేట్లు, కొందరు బ్యూరోక్రాట్లు ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ తీసేందుకు తగిన అవకాశం కోసం కచ్చితంగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపును పై మాటలుగా ప్రస్తుతించే అనేకులు రానున్న కాలంలో దొరికిన ప్రతీ అవకాశంలోనూ ఆ పార్టీపై దుమ్మెత్తి పోయడానికి వెనుకాడు.
అదే సమయంలో నేటి వ్యవస్థలో దురాశాపూరిత ధోరణులు అనేవి - జనసామాన్యంలోకి కూడా చాలా మేరకు ఇంకిపోయాయి. ఇటువంటి కారణం చేతనే చిరకాలం క్రితమే ఒక ప్రఖ్యాత విప్లవ నేత ఇలా అన్నారు - "నేటి పెట్టబడిదారీ వ్యవస్థలో, సామాన్య జనాన్ని కూడా మీకు ఏం కావాలని అడిగితే తమకు అకాశం కావాలని కూడా అడగగలరు" అదే విస్మయం - నెటి వ్యవస్థ బారిన పరిపూర్తిగా చెడగొట్టి వేయబడిన ప్రజల మనస్తత్వాలకు సంబంధించిన విషయం. ఆ కారణం చేతనే, ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అంతరం మాట్లాడుతూ కేజ్రీవాల్ - "ప్రజల ఆకాంక్షలు చూస్తుంటే భయం వేస్తోంది. సమస్యల పరిష్కారానికి నా వద్ద మంత్రదండం లేదు" అని అన్నారు.
కాబట్టి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన అటు ప్రజకు, ఇటు ఆ పార్టీ నాయకులకు, ముందరి కాలంలో పలు పాఠాలను నేర్పేదిగానే ఉండగలదు. ఈ గుణపాఠాలకు అనుగుణంగా, ప్రజలను అదిగేలా చేస్తూ తాను కూడా ఎదగడం ద్వారా మాత్రమే ఆమ్ ఆద్మీ పాతుకుపోయిన సంకుచిత ప్రయోజనాల తేనె తుట్టెను కదిలించింది. అంటే, నిన్నటి ఎన్నికలలో గెలవడం అంటే, ముందు ముందు తన హామీలను నెరవేరుస్తూ, ప్రజానీకాన్ని తన వెంట నడిపించుకోగలగడం, దానికి కొన్ని వందల రెట్లు అదనంగా శ్రమతో, దీక్షతో కూడిన పనిగా ఉండగలదు. ఈ క్రమంలో ఆ పా్రటీ అనివార్యంగా వివిధ సైద్దాంతిక అంశాలపై తన దృక్పథాన్ని వెల్లడించవలసి వస్తుంది. అంటే, ఇప్పటిలా అవినీతి వంటి విడివిడి అంశాలపై కాకుండా ఆ అశాలకు సంబంధించిన మూలాలపై అది తగిన స్పష్టతను ఇవ్వవలసి ఉంటుంది. ఆ పార్టీతో కలగలసి వివిధ స్వార్థ సంకుచిత ప్రయోజనాలపై పోరాడే క్రమంలో దాని వెనకన ఉన్న ప్రజానీకం కూడా పలు గుణపాఠాలు నేర్చుకుంటుంది. వారు క్రమంగా ఈ సమస్యలకు మూలమైన వ్యవస్థ స్వభావాన్ని గమనించి, గుర్తించనారంభిస్తారు. ఈ పరిణామ క్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధపడి దానికి నాయకత్వం వహిస్తేనే అది అంతిమంగా తన ప్రకటిత లక్ష్యాలను సాధించగలదు.
పై ఎదుగుదలకు అది సిద్ధం కాకపోతే ఆమ్ ఆద్మీ ప్రయోగం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. మరో సరికొత్త మానసిక స్థితి స్థాయిలో ప్రజలు యాయా సమస్యల పరిష్కారం కోసం కొంగ్రొత్త దిశలో, సరికొత్త శక్తుల కోసం అన్వేషణకు మరలుతారు. కాబట్టి, నేటి ఆమ్ ఆద్మీ పార్టీ తన వర్తమాన పని విధానంలో, భవిషత్తు తాలూకు పరిణామాలను కూడా నిరంతరం గమనంలో, దృష్టిలో ఉంచుకొని తీరాలి. ఇది మాత్రమే దాని మనగడకూ, విజయానికి హామీ కాగలదు.
- డి. పాపారావు
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications