ఆమ్ ఆద్మీకి ఆమడ దూరంలో లోక్‌సత్తా తీరు!
ఆమ్ ఆద్మీ పార్టీ; 2014 పార్లమెంటరీ ఎన్నికల గోదాలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే, అది దేశ వ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాని నేత అయిన ప్రశాంత్ భూషణ్ మన రాష్ట్రంలో పర్యటించి వెళ్లారు. ఈ స్థితిలోనే; ఆమ్ ఆద్మీతో పొత్తు కోసం ఉవ్విళ్లూరుతోన్న, రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు, వాటివాటి ప్రకటనలతో తెరపైకి వచ్చాయి. వీటిలో ముఖ్యమైనది, జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని- లోక్‌సత్తా పార్టీ.
కాగా; ఈ మేరకు ప్రయత్నాలలో భాగంగా- లోక్‌సత్తా అధినేత ఢిల్లీలో కూడా కేజ్రివాల్‌ను కలిశారట. కానీ, భేషరతు విలీనానికి మినహా, పొత్తులకు ఆమ్ ఆద్మీ సిద్ధంగా లేదని కూడా వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రశాంత్ భూషణ్ పర్యటన అనంతర పరిస్థితీ అదే. అయితే; లోక్‌సత్తా నుంచి మరో ప్రతిపాదన కూడా- ఆమ్‌ఆద్మీకి వెళ్లినట్లుగా ఒక పత్రికలో వార్త వచ్చింది. దాని సారాంశం; లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీల భావాలలో ‘సారూప్యత' అధికంగా ఉన్నందున, మన రాష్ట్రంలో- ఈ రెండు పార్టీలు విడివిడిగా ఎన్నికలకు వెళితే- అది ఓట్ల చీలికకే దారి తీస్తుందనేది. అందుచేత, రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం మానుకోవాలనేది- లోక్‌సత్తా కోర్కే అనేది ఈ వార్త సారాంశం. దీనిలో నిజా నిజాలు ఎలా వున్నా- నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సత్తాల మధ్యన- అంతగా ‘భావ సారూప్యత వుందా?' అనేది, ఇక్కడి అసలు ప్రశ్న.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో కీలక పాత్ర- దాని అవినీతి వ్యతిరేక పోరాటం, అజెండాలతోపాటుగా- దాని తాలూకు సంక్షేమ విధానాలది కూడా. ప్రజలందరికీ రోజువారీ 700 లీటర్ల మేరన ఉచితంగా మంచినీటి సరఫరా, విద్యుత్ బిల్లులను భారీగా తగ్గించడం, డిస్కంల వ్యవహారాలపై న్యాయ విచారణ వంటివి ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు సంక్షేమ పథకాలు. ఇంకా; అలాగే, ఢిల్లీలో రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశానికి గాను, అందకుముందరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రద్దు చేసింది.
మరి, లోక్‌సత్తా పార్టీకి, ఆమ్‌ఆద్మీ పార్టీతో సంక్షేమ అంశాలకు సంబంధించి సరైన సారూప్యత వుందా? అంటే, ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఒక్క అవినీతిపై పోరాటం అనే అంశాన్ని మినహాయించి, ఈ రెండు పార్టీల మధ్యన నిజానికి మరే పోలికా లేదు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్-అనేక మార్లు, పదే పదే- వివిధ ప్రభుత్వాల సంక్షేమ పథకాలను విమర్శిస్తూ మాట్లాడటం తెలిసిందే! ఆయన పార్టీలో సంక్షేమ పథకాలు- ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చేస్తాయి!! కాబట్టి, ప్రజలకు ‘ఉచిత భోజనం' వుండరాదనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి; నేడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ- ప్రజల కోసం తలపెట్టిన సంక్షేమ పథకాలు, జయప్రకాశ్‌కు మింగుడు పడనివే!!! మరి, ఆమ్ ఆద్మీ పార్టీ- దాని పేరుకు తగ్గట్టుగానే- జనసామాన్యం కోసం చేపట్టిన చర్యలను సమర్థించకుండా- ఆ పార్టీతో తమకు భావ సారూప్యత వుందని- జయప్రకాశ్ నారాయణ్ ఎలా చెప్పగలరు? అంటే, ఇది కేవలం నేడు స్థాపించిన కొద్ది మాసాల కాలంలో- అధికార పీఠం దక్కించుకొని-సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీతో- భుజాలు భుజాలు రాసుకునే యత్నం మాత్రమేనా? లేక ఇందులో ఇంతకంటే మరేదైనా వుందా? ఇవి ఆలోచించవల్సిన అంశాలు.
నిజానికి; నేడు మన రాష్ట్రంలో- లోక్‌సత్తా పార్టీ కూడా సాంప్రదాయ రాజకీయ పక్షాలలో ఒకటిగానే ఉంది. కాకుంటే; ఇతర సంప్రదాయక పార్టీలకు భిన్నంగా- ఈ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విమర్శిస్తూ, ప్రజలకు సాధికారత కావాలనే వాదనను పదే పదే ముందుకు తెస్తూ వుంటోంది. మరో రకంగా, చెప్పాలంటే, మన్మోహనా మిక్స్ అనే- దేశవాళీ నయా ఉదారవాద విధానాలను-లోక్‌సత్తా పార్టీ- కాస్తంత ప్రజల ఆత్మగౌరవ పైపూతలతో ప్రచారంలో పెడుతుంది. అంతే తేడా. మరి, ఇప్పటికైతే తన విధానాల దృష్ట్యా- నయా ఉదారవాద విధానాలతో పొసగనిదిగా ముందుకు వస్తోన్న- ఆమ్ ఆద్మీ పార్టీకి, లోక్ సత్తాకూ ఏ విధంగానూ సారూప్యత వున్నట్లు? దాంతో పొత్తు ఎలా కుదిరేటట్లు..?
-డి. పాపారావు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications