వజ్రాలగని ఆంధ్రావని
వడ్డీ వ్యాపారం పేరుతో సాగుతున్న తంతులో కొందరు వ్యక్తులు గూండాల సహాయంతో కోట్లకు పడగెత్తుతున్నారు. సాధారణంగా దేశంలో బొగ్గుగనులున్న అన్ని ప్రాంతాల్లోనూ మాఫియా ముఠాలు బలంగా వేళ్లూనుకుపోయి వుంటాయి. గనుల్లో వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తుండటం వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడం ఈ మాఫియా ముఠాలకు లాభించిన అంశం. కొన్ని చోట్ల వామపక్ష కార్మిక సంఘాలు యూనియన్లను ఏర్పాటు చేసిన ఈ మాఫియా ముఠాల శక్తిముందు వారు బలాదూర్‌గానే మారారు. బీహార్ కోల్‌బెల్ట్‌ను ఏళ్లుగా మాఫియా ముఠాలు యధేచ్చగా ఏలుతున్నాయి. కార్మికుల నుంచి బలవంతంగా మామూళ్లు వసూలు చేయడం నుంచి మద్యం వ్యాపారం, వడ్డీ వ్యాపారం ఇంకా అనేక మార్గాల్లో వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం, ఇదేమని ప్రశ్నిస్తే ఆయుధాలతో జవాబు చెప్పడం మాఫియాలకు రివాజు.












Click it and Unblock the Notifications
