'హీరో కృష్ణకు మినహాయింపు సరికాదు'

అయితే ఇందులో ఎపిఐఐసికి చెందిన భూమే 445 నుండి 455 ఎకరాల దాకా ఉందని, మిగిలిన 80-90 ఎకరాలను ప్రయివేటు వ్యక్తుల నుండి సేకరించాల్సి ఉందని, తర్వాత 80.35 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ అయిందని, ఇందులో సినీ నటుడు కృష్ణ కుటుంబం, మరికొందరికి చెందిన 11.26 ఎకరాలు కూడా ఉందని, భూసేకరణ నుంచి మినహాయింపు కోరుతూ కృష్ణ, విజయనిర్మల అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేశర రెడ్డికి లేఖ రాశారని తెలిపిందని తెలుస్తోంది.
ఆ తర్వాత కృష్ణ కుటుంబానికి చెందిన భూమికి మినహాయింపు లభించిందని, అయితే భూసేకరణలో ఇతరులకు అనుసరించిన విధానాన్ని కృష్ణ కుటుంబానికి తదితరులకు అనుసరించక పోవడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాత్రను సిబిఐ తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టు కోసం ఎపిఐఐసి సేకరించిన భూమిలో 2.5 ఎకరాలను ఓ రాజకీయ నాయకుడు ఆక్రమించుకున్నారని తాజాగా కోర్టుకు తెలిపినట్లుగా సమాచారం. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
కాగా ఎమ్మార్ కేసులో మరో అదనపు చార్జిషీట్‌ను సిబిఐ శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మార్, ఎపిఐఐసి మధ్య జరిగిన ఒప్పందంలో ఉల్లంఘనల వల్ల సర్కారుకు రూ.43 కోట్లు నష్టం వాటిల్లిందని తొలి చార్జిషీట్‌లో పేర్కొనగా, ఏప్రిల్ 23న దాఖలైన అదనపు చార్జిషీట్‌లో దాన్ని రూ.96 కోట్లుగా సవరించింది. తాజా చార్జిషీట్‌లో ఆ మొత్తాన్ని రూ.215కోట్లుగా నిర్ధారించింది. మూడో చార్జిషీట్‌లో కొత్తగా ఎవరినీ నిందితులుగా చూపకున్నా, ఇప్పటికే కేసులు నమోదైన 14మందిపైనే మరిన్ని ఐపిసి సెక్షన్ల కింద కేసులు జోడించినట్లు తెలుస్తోంది.
ఎమ్మార్ వ్యవహారంలో కోనేరు ప్రసాద్, విజయ రాఘవ, సునీల్ రెడ్డి, శ్రీకాంత్ జోషి కలిసి కుట్రపన్ని ఎపిఐఐసికి నష్టం కలిగించారని, చదరపు గజాన్ని రూ.5 వేల నుంచి రూ.45 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారని సీబీఐ పునరుద్ఘాటించింది. దీనివల్ల ఏపీఐఐసీకి రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ మొత్తం కోనేరు ప్రసాద్, సునీల్‌రెడ్డి, ఎమ్మార్ ఎంజీఎఫ్ ఖాతాలకు చేరిందని పేర్కొంది. ప్లాట్ల కొనుగోలుదారుల నుంచి సునీల్ రెడ్డి రూ.63.66 కోట్లు వసూలు చేశారని తెలిపింది.
ఇవి ఆయన సృష్టించిన పది డమ్మీ కంపెనీల ఖాతాలకు చేరాయని వెల్లడించింది. ఇక రూ.32.34 కోట్లు కోనేరు ప్రసాద్ కుమారుడి ఖాతాలోకి వెళ్లాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలం కూడా చార్జిషీట్‌కు జత చేసింది. శ్రవణ్ గుప్తా పర్యవేక్షణలో మొత్తం 37 ప్లాట్లు విక్రయంకాగా, అందులో 18 ప్లాట్లను 5 వేలకు గజం చొప్పున ఉద్యోగుల పేరుతో ఆయనే తీసుకున్నట్లు, మిగతా వాటిని అధిక ధరలకు విక్రయించినట్లు ఇది వరకే తేల్చిన సిబిఐ ఆ మొత్తం ఎంతో తాజాగా తేల్చినట్లు తెలుస్తోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications