టెలిగ్రామ్ ఇక చరిత్రే: సిపాయిల తిరుగుబాటు...

Telegram booking ends at 8pm today
నూటా అరవై ఏళ్లకు పై నుండి సేవలు అందిస్తున్న టెలిగ్రామ్ ఇక మన దేశంలో కనిపించకుండా పోనుంది. టెలికం రంగం పుంజుకోని రోజుల్లో, మొబైల్స్, ఇంటర్నెట్ వంటి కమ్యూనికేషన్ సాధనాలు లేని రోజుల్లో శుభకార్యమైనా, బాధాకరమైన వార్తనైనా టెలిగ్రామ్ మోసుకు వచ్చేది! ఆధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులోకి రావడంతో కొన్నేళ్లుగా టెలిగ్రామ్‌కు ఆదరణ తగ్గింది. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగవుతోంది. ఇక టెలిగ్రామ్ చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది.

ఈ రోజుతోనే టెలిగ్రామ్ కథ ముగియనుంది. నష్టదాయకంగామారిన టెలిగ్రామ్ సేవలకు బిఎస్ఎన్ఎల్ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు మంగళం పలుకుతోంది. దేశవ్యాప్తంగా 75 చోట్ల ఉన్న టెలిగ్రామ్ ఆఫీసుల్లోని యంత్రాలు మూలనపడనున్నాయి. ప్రస్తుతం టెలిగ్రామ్ విభాగంలో ఉన్న దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను బిఎస్ఎన్ఎల్ ఇతర సేవలకు ఉపయోగించుకోనుంది. టెలిగ్రామ్ ఒకప్పుడు తపాలా పరిధిలో కొనసాగినా.. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిధిలోకి వచ్చింది.

టెలిగ్రామ్ వ్యవస్థకు ఏటా రూ.100 కోట్లు ఖర్చవుతుండగా, దాదాపు రూ.75 లక్షల వార్షికాదాయం మాత్రమే లభిస్తోంది. కోల్‌కతా నుండి డైమండ్ హార్బర్ వరకు ప్రయోగాత్మకంగా 1850లో తొలి టెలిగ్రాఫ్ లైన్‌ను నాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. 1854లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

'రంగూన్ (బర్మా) యుద్ధం ముగిసింది' అంటూ 1852లో కోల్‌కతాలోని లార్డ్ డల్హౌసీకి అందిన టెలిగ్రామ్ చరిత్రలోకి ఎక్కింది. నిజానికి ఈ టెలిగ్రామ్ లేకుంటే 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు విజయవంతమయ్యేది. టెలిగ్రామ్‌లు అందుబాటులోకి రావడంతో బ్రిటిష్ పాలకులు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని, ఎక్కడికక్కడ తిరుగుబాటును అణచి వేశారు. 'బ్రిటిష్ పాలన నుంచి భారత్ చేజారకుండా టెలిగ్రామ్‌లే కాపాడాయి' అని డల్హౌసీ పేర్కొన్నారు.

టెలిగ్రామ్‌ల అవసరం, వాటి పాత్ర గణనీయంగా పెరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా బ్రిటన్-భారత్ మధ్య సముద్ర గర్భంలో టెలిగ్రాఫ్ లైన్స్ వేసేసింది. ఇక్కడ జరుగుతున్న సంగతులను ఏ క్షణానికి ఆ క్షణం చేరవేస్తూ... అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను తక్షణం అందుకుని అమలు చేస్తూ తెల్లోళ్లు మనల్ని పాలించేశారు. ఈ సేవలను బ్రిటిష్ వాళ్లు తమ అవసరాలకోసం ప్రారంభించుకున్నప్పటికీ, మనోళ్లు వాటిని వెంటనే పట్టేసుకున్నారు.

స్వాతంత్రోద్యమంలో టెలిగ్రామ్‌లు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. నిధుల సేకరణకు, ప్రజల సమీకరణకు మహాత్మా గాంధీ అధికంగా టెలిగ్రామ్‌లపైనే ఆధారపడేవారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు దేశ సరిహద్దులు దాటిన వారికీ, దేశంలోనే ఉన్నవారి బంధువులకూ మధ్య ప్రధాన సమాచార వారధిగా ఉన్నది ఇదే. 1980లను టెలిగ్రామ్‌లకు మహర్దశగా చెప్పుకోవచ్చు. అప్పట్లో దేశవ్యాప్తంగా 12వేల మంది సిబ్బంది పనిచేసేవారు. ఏటా 6కోట్ల టెలిగ్రామ్‌లు వెళ్లేవి. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు మహాత్ముడు మరిలేరని నాటి సంస్థానాలకు భారత ప్రభుత్వ టెలిగ్రామ్ పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+