'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం' (ఫోటోలు)

హైదరాబాద్: దేశ రక్షణ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషిస్తుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన 95వ డిగ్రీ ఇంజినీరింగ్‌ కోర్సు, 23వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీం కోర్సు స్నాతకోత్సవానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణ్వాయుధాల దాడులు, సైబర్ నేరాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

త్రివిధ దళాల అధిపతులు పట్టింపులకు వెళ్లకుండా దేశ రక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పటిష్ట పరుచుకోవాలని సూచించారు. దేశ భద్రతకు సంబంధించి అవసరం మేరకు ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా ఎంసీఈఎంఈ లోతైన అధ్యాయనం చేయాలని కోరారు.

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

అణు ఆయుధాల దాడులు, సైబర్‌ నేరాల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

త్రివిధ దళాల అధికారులు ఎలాంటి ఇగోలకు పోకుండా దేశ రక్షణ కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కంప్యూటర్లు హాక్ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

సోషల్ మీడియాపై దృష్టిసారించాలని, టెక్నాలజీని మన దేశంలో తయారు చేసే విధంగా యువ ఇంజీనీర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంతా ఉపయోగకరం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

అనంతరం 95వ డిగ్రీ ఇంజినీరింగ్‌ కోర్సులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్‌ జి.రంగరాజన్‌, డీజీఈఎంఈ ట్రోఫీని, 23వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీం కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లెప్ట్‌నెంట్‌ విశాల్‌ సింగ్‌కు ట్రోఫీని గవర్నర్‌ నరసింహన్‌ అందజేశారు.

 'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

'దేశ రక్షణలో టెక్నాలజీ ఎంతో కీలకం'

కార్యక్రమంలో ఎంసీఈఎంఈ లెప్టినెంట్ జనరల్, కమాండెంట్ గురుముఖ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+