తొలి రోజు జైల్లో డేరా బాబా ఇలా: ఖాళీ అవుతున్న సౌదా ఆఫీస్
రోహ్‌తక్/ సిర్సా: రెండు అత్యాచారాల కేసుల్లో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ సోమవారం రాత్రంతా సురేనియా జైల్లో మౌనంగా గడిపాడు. రాత్రంతా ఆయన భోజనం చేయలేదని, కేవలం మంచినీళ్లు తాగే జైలు గదిలో పచార్లు చేశారని అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. అయితే మంగళవారం ఉదయం మాత్రం పాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం మెల్లగా ఖాళీ అవుతోంది. పాత ప్రధాన కార్యాలయంలో ఉన్న డేరా సచ్ సౌదా సిబ్బంది అంతా బయటకు వచ్చేశారు. విశాలమైన కొత్త కాంప్లెక్స్‌లో ఇంకా ఉన్న దాదాపు 200 మందిని సైతం ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలుశిక్ష విధించడానికి రెండు రోజుల ముందు నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్మీ జవాన్లు డేరాకు చెందిన కొత్త కాంప్లెక్స్‌కు 500 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి కాంప్లెక్స్ లోపల ఇంకా ఉన్న వారినందరినీ వెళ్లిపోవలసిందిగా కోరుతున్నారు.

12 ఏళ్ల క్రితం...
డేరా సచ్చాసౌదాకు ప్రజాజరణ పెరగడంతో 12 ఏళ్ల క్రితం కొత్త కాంప్లెక్స్‌ను నిర్మించారు. కొత్త కాంప్లెక్స్‌కు కొద్ది దూరంలో ఉన్న పాత కాంప్లెక్స్‌ను డేరా సచ్చాసౌదా వ్యవస్థాపకుడు మస్తానా బలూచిస్తాని నిర్మించినట్లు డిప్యూటీ కమిషనర్ ప్రభ్‌జ్యోత్ సింగ్ పిటిఐకి చెప్పారు. కొత్త కాంప్లెక్స్‌లో ఇప్పటికీ 200 మంది దాకా ఉన్నారు. వీరిలో చాలామంది డేరా ఉద్యోగులే. మంగళవారం ఉదయంనుంచి దాదాపు 700 మంది కాంప్లెక్స్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ చెప్పారు. వాళ్లు ఇళ్లకు తిరిగి వెళ్లడానికి బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

18 మంది మైనర్ బాలికలు...
డేరా ఆశ్రమం లోపల బాలికలకోసం ఏర్పాటు చేసిన ఓ భవనంలో 18 మంది మైనర్ బాలికలు ఉన్నారని, వారిని కూడా బైటికి తీసుకు వచ్చినట్లు సతీష్ కుమార్ చెప్పారు. అయితే ఆశ్రమంలోపల తాముఆనందంగానే ఉన్నామని, బయటకు వెళ్లడానికి ఇష్టపడలేదని, అయితే డేరా మేనేజిమెంట్‌ను ఒప్పించి వారి సాయంతో ఆ బాలికలను బయటకు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. వారిని రాష్ట్రంలోని జువనైల్ హోమ్స్‌లో ఉంచుతామని ఆయన చెప్పారు.

34 మంది బాలురు..
సోమవారం 34 మంది బాలురను కూడాబయటకు తీసుకువచ్చినట్లు సింగ్ చెప్పారు. బాలికలను వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు చర్యలు తీసుకుంటామని మరో అధికారి చెప్పారు. గత రెండు రోజుల్లో దాదాపు 6,500 మంది డేరా అనుయాయులు ఆశ్రమం కాంప్లెక్స్‌ను వదిలిపెట్టి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని తమ ఇళ్లకు వెళ్లిపోయారని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.

కర్ఫ్యూ సడలింపు...
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్క పోవడంతో సిర్సాలో అధికారులు మంగళవారం ఉదయం 7 గంటలనుంచి 12 గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేసి 24 గంటలు గడిచిన తర్వాత హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications