కెసిఆర్ మొండిఘటం

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మొండి ఘటం. ఆయన తాను నిశ్చయింకుంటే ఎవరూ వద్దన్నా వినరని సమాచారం. విజయవాడలో ఈ నెల 29వ తేదీన తలపెట్టిన జై ఆంధ్ర సభకు కెసిఆర్ వెళ్లాల్సి ఉండింది. అయితే, దానికి కెసిఆర్ వెళ్లడం లేదనే వార్తలూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు అహ్వానించగానే ఆయన అందుకు అంగీకరించారు. ఆయన అందుకు అంగీకరించడమే తరువాయి చర్చనీయాంశంగా మారింది. జై ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాలను కలిసి చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

విజయవాడ సభకు వెళ్లాలనే కెసిఆర్ నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు ఆహ్వానం పలికారు. విజయవాడకు కెసిఆర్ ను సాదరంగా ఆహ్వానిస్తామని వారు చెప్పారు. ఈ స్థితిలో తెలంగాణ నుంచి ఆయన నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైంది. కెసిఆర్ విజయవాడకు వెళ్లొద్దంటూ తెలంగాణలోని సంస్థలు కొన్ని ప్రకటనలు చేశాయి. ఈ స్థితిలో కెసిఆర్ వ్యూహం బెడిసి కొట్టిందని, ఆయన విజయవాడ పర్యటనను రద్దు చేసుకుంటారని ప్రచారం జోరందుకుంది.

నిజానికి, కెసిఆర్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని లాభనష్టాల గురించి గానీ పరిణామాల గురించి గానీ ఆలోచించరు. ముందుకే సాగుతారు. విజయవాడకు వెళ్లాలనే తన నిర్ణయంలో మార్పు లేదని కెసిఆర్ తాజాగా ప్రకటించడాన్నిబట్టి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. కత్తి పద్మారావు మరోసారి సోమవారం కెసిఆర్ ను కలిశారు. ఈ భేటీ తర్వాత కత్తి పద్మారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కెసిఆర్ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ నెల 29వ తేదీన జరగాల్సిన జై ఆంధ్ర మహాసభ తుఫాను కారణంగా వాయిదా పడిందని, సభ రద్దు కాలేదని ఆయన చెప్పారు. ఈ సభకు కెసిఆర్ తప్పకుండా వస్తారని ఆయన చెప్పారు. కెసిఆర్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాను విజయవాడ సభకు వెళ్లి తీరుతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+