కాదంటూనే జారుకుంటున్న జగన్ వర్గం

జయసుధ మొదటిసారి రచ్చబండలో పాల్గొన్నప్పుడు తాను తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కార్యక్రమంలో పాల్గొన్నానని తామంతా ఎప్పుడూ జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. ఆ తర్వాత సిఎం కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె అధికారికంగా జగన్‌కు దూరంగా ఉంటానని చెప్పనప్పటికీ కాంగ్రెసు ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్నారు. శేషారెడ్డి కూడా సిఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు. ఇక కొర్ల భారతి కూడా కాదు కాదని చెబుతూనే కాంగ్రెసు గూటికి చేరిపోయింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా వెనక్కి వస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం సిఎంను కలిశారు. తాజాగా జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాంగ్రెసు గూటికి చేరతారనే వార్త చర్చకు దారి తీసింది.
2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కకు పెట్టి జగన్ చొరవ కారణంగా ద్వారంపూడి టిక్కెట్ దక్కించుకున్నారు. జగన్‌కు ఆయన సన్నిహితుడు కూడా. అలాంటి ద్వారంపూడి ఇటీవలి వరకు జగన్‌ను వీడేది లేదని చెప్పారు. ఇప్పుడు అవిశ్వాసంపై జగన్ తీరు నచ్చక కాంగ్రెసులోకి రావడానికి సిద్ధపడుతున్నాడు. ద్వారంపూడి దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 24న ఎమ్మెల్యేల భేటీకి కేవలం బలవంతం మీదనే వచ్చారని, అందరూ ఊహించినట్లుగా జగన్ ఎమ్మెల్యేల సంఖ్య శాసనసభ సమావేశాలు పూర్తయ్యే నాటికి ఏడు ఏనిమిదికి మించక పోవచ్చుననే వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కాగా జగన్ ఎమ్మెల్యేలతో సిఎం కిరణ్ నేరుగా మంతనాలు జరుపుతూ వారిని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారట.












Click it and Unblock the Notifications