జగన్ ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇచ్చేనా?

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్ర తర్వాత దానికి విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండేళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న 24 స్థానాల ఉప ఎన్నికలను జగన్ సవాల్‌గా స్వీకరిస్తున్నారు. జగన్ కోసం పదిహేడు మంది(పదహారు మంది కాంగ్రెసు, ఒకరు పిఆర్పీ) ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిపై కాంగ్రెసు పార్టీ అనర్హత వేటు వేయనుంది. అలాగే తెలంగాణలోని మరో ఏడు నియోజకవర్గాల్లో ఉప జరగనున్నాయి. తెలంగాణలోనూ పోటీకి జగన్ సై అనే అవకాశాలే ఎక్కువ. ఈ ఉప ఎన్నికలు ఫిబ్రవరిలో జరగవచ్చుననే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ ప్రచారం కోసం ఓదార్పుకు బ్రేక్ ఇచ్చే అవకాశముంది.

తనకు మద్దతిచ్చిన అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని టిడిపి, కాంగ్రెసులకు గట్టి షాక్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. ఎన్నికలు ఫిబ్రవరిలో అంటే మరెంతో సమయం లేనందున గుంటూరులో యాత్ర పూర్తి కాగానే ఉధృతంగా ప్రచారం చేపట్టాలని ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్యాడర్ కూడా జగన్‌ను కోరుతున్నాయట. గెలుపు మనదే అని అయితే కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల వలె భారీ మెజార్టీతో గెలిచి టిడిపి, కాంగ్రెసులకు చెక్ చెప్పాలని వారు భావిస్తున్నారు. ఇందుకోసం జగన్ ఇప్పటి నుండే ప్రచారం సాగిస్తే అది ప్లస్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జగన్ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఆయన తన ఓదార్పు యాత్రలోనే తన ఎమ్మెల్యేలను ఆశీర్వదించాలని చెబుతూ ప్రచార పర్వానికి తెరలేపారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు గుంటూరులో ఓదార్పు యాత్ర చేపట్టి ఆ తర్వాత బ్రేక్ ఇచ్చి నేరుగా ప్రచార బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+