వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో బాబు!: హస్తాన్ని కొట్టబోతే బాలకృష్ణకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Balakrishna
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలోని యువతరంగం కార్యక్రమంలో చేసిన వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో వారసత్వాలు పని చేయవని, ఒరిజినాలిటి ఉండాలని లేకపోతే రాణించరని ఆయన ఆ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు నారా, నందమూరి కుటుంబాల్లో రాజకీయ వారసత్వం లేదని కూడా అన్నారు. ఆయన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, హీరో నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసుకునే అన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ రాజకీయ పర్యటనలకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు కాకపోయినప్పటికీ భవిష్యత్తులో బాలయ్య తనకు పవర్ సెంటర్‌గా మారుతారని భావించిన బాబు ముందుచూపుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేసినప్పటి నుండి ఆయన రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన క్రమంగా పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. తాను పార్లమెంటు స్థానం నుండి కాకుండా అసెంబ్లీ నుండే పోటీ చేస్తానని ప్రకటించి బాబు వర్గంలో కొంత అలజడి సృష్టించారు. దీంతో ఇన్నాళ్లు తన ఆధీనంలో ఉన్న పార్టీ చేతులు మారకుండా ఉండేందుకు, ఆ దిశలో పార్టీ కార్యకర్తలను ఇప్పటి నుండే అప్రమత్తులుగా చేసేందుకే ఆయన ప్రత్యక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అన్నప్పటికీ పరోక్షంగా బాలయ్యనే టార్గెట్ చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై మక్కువ పెంచుకున్న జగన్ ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి, కాంగ్రెసుపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి రామరాజ్యం రావాలంటే తనను గెలిపించాలని ఆయన చెబుతున్నారు. దీంతో జగన్‌ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం బాబు నందమూరి హీరోను టార్గెట్ చేసుకున్నారన్న వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు. బాబుకు అలాంటి అవసరం లేదన్నారు. బాబు ఏ సందర్భంలో అన్నారో చూడాలని చెబుతున్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ బాబు ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రాహుల్, జగన్‌ను ఉద్దేశించే అన్నారని చెబుతున్నారు. కార్యక్రమంలో యువత వారసత్వ రాజకీయాల గురించి చర్చించినందు వల్లే బాబు ఆ వ్యాఖ్యలు చేశారని, తనకు తానుగా ప్రత్యేకంగా బాబు వ్యాఖ్యానించలేదని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తన వారసత్వ డైలాగులతో హస్తాన్ని టార్గెట్ చేయబోయి చిక్కుల్లో పడ్డట్లుగా కనిపిస్తోంది.

English summary
It seems, TDP chief Nara Chandrababu Naidu in trouble with his Inheritance politics comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X