ఫ్యామిలీని బాబు ఒక్కటిగా చేశారా: ఆ ఒక్కరెక్కడ?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా - నందమూరి కుటుంబాలని ఒక్కటిగా చేశారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కటిగా చేసినట్టు కనిపిస్తున్నప్పటికీ కుటుంబంలో కొంతమేర అసంతృప్తి మాత్రం ఉండి ఉంటుందని చెబుతున్నారు. అయితే నారా కుటుంబం మాత్రం పూర్తిగా ఏకతాటి పైకి వచ్చిందని చెప్పవచ్చు. కారణాలు ఏవైనా రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ ఇతర నందమూరి కుటుంబాన్ని ఏకం చేసిన చంద్రబాబు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆసంతృప్తిని మాత్రం చల్లార్చినట్లుగా కనిపించడం లేదని చెబుతున్నారు.

ఫ్యామిలీని బాబు ఒక్కటిగా చేశారా: ఆ ఒక్కరెక్కడ?

రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో అంతా తానై కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు పాదయాత్ర కంటే రెండు రోజుల ముందే అనంతపురంకు వెళ్లి అన్నీ సిద్ధం చేశారు. పాదయాత్ర విజయవంతం కావాలని హనుమంతుడి ఆలయంలో పూజలు చేశారు.

ఫ్యామిలీని బాబు ఒక్కటిగా చేశారా: ఆ ఒక్కరెక్కడ?

కారణాలు ఏవైనా హీరో నందమూరి బాలకృష్ణ తొలి నుండి బాబుకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఎప్పుడూ బాబుపైన తన అసంతృప్తిని ప్రకటించింది లేదు.

ఫ్యామిలీని బాబు ఒక్కటిగా చేశారా: ఆ ఒక్కరెక్కడ?

బాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్ ఒక్కడిని సినిమా ఆడియో విడుదల సందర్భంగా తనకు ముగ్గురు ఇన్సిపిరేషన్ అని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, పెదనాన్న చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణలు అన్నారు.

ఫ్యామిలీని బాబు ఒక్కటిగా చేశారా: ఆ ఒక్కరెక్కడ?

చంద్రబాబు నాయుడు పాదయాత్ర పాలమూరుకు చేరుకున్నాక హీరో జూనియర్ ఎన్టీఆర్ యాత్రలో పాలుపంచుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటికి ఎలాంటి సూచనలు కనిపించడం లేదు. బాలకృష్ణ కూడా కర్నూలు పాదయాత్రలో పాలుపంచుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు.

చంద్రబాబు పాదయాత్ర కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు బాలకృష్ణ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన యాత్రలో పాలుపంచుకుంటారనే వార్తలు వచ్చాయి. కర్నూలులో బాబు యాత్ర ఈ రోజు(సోమవారం)తో ముగియనుంది. ఇప్పటి వరకు బాలకృష్ణ యాత్రలో ఎక్కడా కనిపించలేదు. పాలమూరులో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారనే వార్తలు కూడా అప్పుడే వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చడీ చప్పుడు లేదు. జూనియర్ కూడా పెదవి విప్పింది లేదు. దీంతో అసలు జూనియర్ యాత్రలో పాల్గొంటారా అనే చర్చకు తెరలేచింది.

అసలు బాబు జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తిని చల్లార్చినట్లుగా కనిపించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఇంకా టిడిపి పైన, బాబు పైన అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. అయితే హరికృష్ణ బాబు పాదయాత్రలో ప్రధానంగా కనిపించినందున జూనియర్ కూడా తగ్గి ఉంటారనే భావన అందరిలో కలిగిందని కానీ, ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదంటున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు మాత్రమే హరికృష్ణ పాల్గొని ఉండవచ్చునని చెబుతున్నారు. ఎన్టీఆర్ బాబు యాత్ర పైన ఇప్పటి వరకు ప్రకటన కూడా చేసింది లేదు. దీంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.

అయితే సాధారణ ఎన్నికలకు ముందు నారా-నందమూరి ఫ్యామిలీలోని ఇబ్బందులను మాత్రం చంద్రబాబు అధిగమించారని చెబుతున్నారు. కారణమేదైనా తన తనయుడి అంశాన్ని పక్కన పెట్టి హరికృష్ణ బాబుకు మద్దతు పలికారు. బాలకృష్ణ ఎప్పుడూ బాబుకు సై అంటారు. ఇటీవల ఎన్టీఆర్ మరో తనయుడు, మరికొందరు కుటుంబ సభ్యులు బాబు యాత్రలో పాల్గొన్నారు. హీరో నారా రోహిత్ కూడా ఒక్కడనే సినిమా పాటల విడుదల సందర్భంగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. తనకు ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణలు ఇన్సిపిరేషన్ అని చెప్పారు.

నారా రోహిత్ ఒకప్పుడు చంద్రబాబును బాగా విమర్శించిన ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడు. జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి మినహా చంద్రబాబు నారా - నందమూరి కుటుంబాలను ఏకం చేయడంలో మాత్రం సఫలమయ్యారని అంటున్నారు. అయితే హరికృష్ణ తన తనయుడిని నచ్చజెప్పి 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేసే విధంగా జూనియర్ అసంతృప్తిని తొలగిస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+