రాములమ్మ స్థానంలో కెసిఆర్: కెటిఆర్‌పై ఒత్తిడి

వచ్చే ఎన్నికల్లో మెదక్ నుండి కాని పక్షంలో నల్గొండ జిల్లాలోని భువనగిరి లోకసభ స్థానం నుండి పోటీ చేసేందుకు రాములమ్మ ఆసక్తి కబరుస్తున్నారట. కెసిఆర్ మెదక్ నుండి పోటీ చేసిన పక్షంలో... విజయశాంతి భువనగిరికి మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిరిసిల్ల శాసనసభ్యుడు, కెసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా ఎంపీగా పోటీ చేయాలని పార్టీ క్యాడర్ నుండి ఒత్తిడి పెరుగుతోందట.
కెసిఆర్ అంతకుముందు కరీంనగర్ నుండి ప్రాతినిథ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన మహబూబ్ నగర్‌కు మారారు. వచ్చేసారి మెదక్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కెసిఆర్ తర్వాత ఇప్పుడు కరీంనగర్ నుండి ఆయన తనయుడు కెటిఆర్‌ను పోటీ చేయించాలని జిల్లా నేతలు భావిస్తున్నారు. అందుకోసం వారు కెసిఆర్, కెటిఆర్‌ల పైన ఒత్తిడి కూడా తెస్తున్నారట. కెటిఆర్ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావం పలు అసెంబ్లీ నియోజకవర్గాల పైన పడుతుందని వారు చెబుతున్నారట.
అయితే కెసిఆర్ మాత్రం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పలువురు తెలంగాణ కాంగ్రెసు ఎంపీలను తెరాసలోకి ఆహ్వానిస్తున్నారు. అందులో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. ఆయన వస్తే ఆయనకే టిక్కెట్. లేదంటే మాజీ ఎంపి బి వినోద్ కుమార్‌ను కరీంనగర్ స్థానం నుండి పోటీ చేయించాలని భావిస్తున్నారట. కానీ కెటిఆర్ పట్ల మాత్రం కెసిఆర్ సుముఖంగా లేరట. జనవరిలో కెసిఆర్ లోకసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications