వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాచ్ ఫిక్సింగ్: జగన్‌పై టిడిపి రివర్స్ అటాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై విమర్శించే సొంత పార్టీ నేతల పైన కాంగ్రెసు పార్టీ వేటు వేయడం, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూకేటాయింపులపై నియమించిన సభా సంఘంలో తమకు అంతగా ప్రాతినిథ్యం ఇవ్వక పోవడం వంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి. ఇటీవలి వరకు జగన్, ఆయన పార్టీ నేతలు టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం టిడిపికి వచ్చిందనే చెప్పవచ్చు. జగన్ అక్రమాలకు పాల్పడ్డారని మాజీ చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పలుమార్లు విరుచుకు పడ్డారు. అయితే మంత్రివర్గంలో వారి వ్యవహార శైలి నచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకర రావును బర్తరఫ్ చేశారు. ఇటీవల డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖలో కుదింపు చేశారు. అంతేకాదు సహచర మంత్రుల పైనా వారు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో టిడిపి అటు నుండి నరుక్కు రావాలనే యోచనలో పడింది. సిఎం జగన్‌తో కుమ్మక్కయ్యారని అందుకే ఆయన అవినీతిపై ప్రశ్నిస్తున్న డిఎల్, శంకర్రావులను తొలగించారని టిడిపి నేతలు ఆరోపించారు. వాటిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని టిడిపి భావిస్తోంది. తద్వారా జగన్, మంత్రుల అవినీతిపై ప్రశ్నించినందుకు సిఎం సొంత పార్టీ నేతల పైనే వేటు వేశారని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

ఇక భూకేటాయింపులపై ఇటీవల వేసిన సభా సంఘం పైనా టిడిపి విరుచుకు పడింది. సభా సంఘంలో తమ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల నిష్పత్తిని బట్టి సభ్యులను నియమించలేదని, వారిని కూడా తమను సంప్రదించకుండానే నియమించడం పట్ల టిడిపి మండిపడుతోంది. భూకేటాయింపుల అంశంలో వైయస్ రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని రక్షించేందుకే కిరణ్ ఇలా నియామకం చేశారని అంటున్నారు. అంతేకాదు సొంత పార్టీలోని కొందరు నేతలు కూడా సిఎం కిరణ్ జగన్ అవినీతి పైన, పార్టీ అధినేత్రిని విమర్శిస్తున్నప్పటికీ ఏమీ మాట్లాడక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలన్నింటిని తీసుకొని కిరణ్‌తో కుమ్మక్కైంది టిడిపి కాదని జగనే అని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం కేవలం టిడిపి అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

English summary
Telugudesam Party is going new strategy on match fixing issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X