ఇరుకునపడ్డ బాబు: యాత్రతో హరికృష్ణ క్యాష్!

అయితే, ఇప్పుడు బాబు యాత్ర చేపట్టక పోవడంతో పాటు, పార్టీ నాయకులకు ఇష్టంలేకపోయినా ఆయన మనసుమార్చుకున్నారని అంటున్నారు. ఆయన యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. టిడిపి వ్యవస్థాపకులు, తన తండ్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి ఈ యాత్ర మొదలు పెట్టేందుకు హరికృష్ణ సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడకు వచ్చిన తరువాత నిర్దిష్టంగా ఏ తేదీన ఈ యాత్రను మొదలు పెట్టాలి? ఎటు వైపు యాత్ర నిర్వహించాలి? అన్నది ఖరారవుతుందట. హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత మిగిలిన ఎంపీలు ఆయనతో మాట్లాడి ప్రస్తుతానికి యాత్రలు పెట్టుకోవద్దని సూచించారట. ప్రస్తుత పరిస్థితుల్లో బాబు యాత్ర లేకపోయినప్పటికీ, హరికృష్ణ యాత్ర చర్చనీయాంశమైంది.
మరోవైపు హరికృష్ణ తన అన్న టిడిపిని పునరుద్ధరించే అవకాశాలున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారసత్వ పోరు నేపథ్యంలో చంద్రబాబును ఢీకొట్టేందుకే హరి సిద్ధమైనట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఇరుకున పడ్డారు. దీనిని సమైక్యాంధ్ర నినాదంతో హరికృష్ణ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications