కెసిఆర్, బిజెపికి షాక్: విద్యార్థుల రాజకీయ పోరు

అవతరించనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 1952 నుండి విద్యార్థి సంఘాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
విద్యార్థులందరు ఓ రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం సమావేశమైన
విద్యార్థి ఐకాస ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 17న పార్టీని ఆవిర్భవించనున్నామని, ఇప్పటకే తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెరాస, బిజెపితో ఎలాంటి పొత్తులు
ఉండవని విద్యార్థి నేతలు ప్రకటించారు. జూలై 10 నుంచి జిల్లాలో సదస్సులు నిర్వహించనున్నామని, జూలై 20 నుంచి
సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభంకానుందని విద్యార్థి నేత పిడమర్తి రవి తెలిపారు. త్వరలో జరిగే పంచాయితీ ఎన్నికల్లోనూ
విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి పోటీకి సిద్ధమైంది.
తెలంగాణ ఉద్యమంలో 1952 నుండి విద్యార్థులతే కీలక పాత్ర అని, 2009 డిసెంబర్ ప్రకటన విద్యార్థుల విజయమని వారు
ప్రకటించారు. తాము తెరాస, భాజపాలకు ప్రత్యామ్నాయం కాగలమని చెప్పారు. జూలై 4న దొడ్డి కొమరయ్య వర్ధంతి
కార్యక్రమాలు, 10 నుంచి జిల్లాల్లో మహాసభలు, 20 నుంచి విద్యార్థి ఐకాస సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయని
చెప్పారు. తెలంగాణ విద్యార్థి ఐకాస-ఓయు ఐకాస పేరుతో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు చెప్పారు.
కాగా, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి విద్యార్థులదే కీలకపాత్ర. విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని రాజకీయ
నాయకులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు మొదటి నుండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులే రాజకీయ పార్టీని
స్థాపించనున్నారు.












Click it and Unblock the Notifications