andhra pradesh assembly elections 2019 andhra pradesh andhra pradesh assembly seats ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చౌడవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చోడవరం, బుచ్చయ్యపేట, రోలుగుంట మండలాలు పూర్తిగా చోడవరంలో చేరాయి. ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు 2004 లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్దిగా గెలిచారు. 2009 లో అనకాపల్లి నుండి పోటీ చేసారు. వేచలపు పాలవెల్లి ఇక్కడి నుండి రెండు సార్లు గెలిచారు. ఎర్రునాయుడు మూడుసార్లు, బలిరెడ్డి సత్యారావు రెండు సార్లు విజయం సాధించారు. 2004 లో ఇక్కడ గెలిచిన గంటా శ్రీనివాస రావు 1999లో అనకాపల్లి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1955 నుండి 1962 వరకు కొండకర్ల గా ఈ నియోజకవర్గం 1952 లో చోడవరం నియోజకవ ర్గం ఏర్పడింది. 2009 తరువాత ఇక్కడ రాజకీయంగా పలు సమీకరణాలు మారిపోయాయి.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఆరు సార్లు, కెఎల్‌పి , స్వతంత్ర, జనతా పార్టీలు ఒక్కొక్క సారి మరో సారి స్వతంత్ర అభ్యర్ది గెలుపొందారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన సన్యాసి రాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కరణం ధర్మశ్రీ మీద గెలిచారు. ఆ తరువాత 2009 లో జరిగి న రాజకీయా పరిణాలతో కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ ను వీడి వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 196506 ఓట్లు ఉండగా ,అందులో 165662 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన సన్యాసిరాజు కు 80560 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కరణం ధర్మశ్రీ కి 79051 ఓట్ల వచ్చాయి. టిడిపి అభ్యర్ది సన్యాసి రాజు 909 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.