పార్టీని నడిపే తీరు ఇదికాదు: టీకి షా నిర్దేశం(పిక్చర్స్)

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు ఉన్నా, వారి అభిమానాన్ని ఓట్ల రూపంలో సాధించడంలో స్థానిక నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యక్తం చేశారు. ఆయన గురువారం నిర్వహించిన తెలంగాణ పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక మంది సీనియర్ నేతలు, జాతీయ నాయకుల సహకారంతో పార్టీ మంచి మెరుగైన స్థితిలో ఉన్నా ఓట్లు, ఎన్నికల ఫలితాల దగ్గరకు వచ్చేసరికి అనుకున్నంతగా ఫలితాలను సాధించలేకపోతున్నామని అన్నారు. తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా గురువారం నాడు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలోనూ, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలోనూ, పార్టీ సభ్యత్వ సమావేశంలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నామని, తెలంగాణలో 35 లక్షల మంది, ఆంధ్రాలోనూ కనీసం 35 లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని అమిత్ షా సూచించారు. తెలంగాణలో 20 లక్షల ఓట్లు వచ్చినా, అనుకున్నంత మేర అసెంబ్లీ సీట్లు దక్కలేదని చెప్పారు. ప్రతి సభ్యుడూ కనీసం ఐదుగురితో ఓట్లు వేయించగలిగితే బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా వారికి చెప్పారు.

ప్రతి పోలింగ్ బూత్‌లో ఇద్దరు క్రియాశీల సభ్యులను గుర్తించాలని, వారు ఒకొక్కరు వంద మంది సాధారణ సభ్యులను చేర్చేలా చూడాలని ఆయన సీనియర్లకు సూచించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే 2019 వరకూ ఎన్నికలు లేకపోయినా, మిగిలిన రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకోవాలని, అంశాలను గుర్తించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు.

బిజెపి లక్ష్యం పంచాయతీ నుండి పార్లమెంటు వరకూ అన్నింటిలో విజయం సాధించేలా, వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేలా పార్టీ సన్నద్ధం కావాలని అన్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కృష్ణదాస్, సభ్యత్వ వ్యవహారాల దక్షిణాది ఇంఛార్జ్ రవితోనూ విడిగా సమావేశమై అమిత్ షా పార్టీ పరిస్థితిని మదింపు వేశారు. మరో పక్క పార్టీ సీనియర్లతో విడిగా భేటీ అయ్యారు.

అమిత్ షా

అమిత్ షా

భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు ఉన్నా, వారి అభిమానాన్ని ఓట్ల రూపంలో సాధించడంలో స్థానిక నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యక్తం చేశారు.

అమిత్ షా

అమిత్ షా

ఆయన గురువారం తెలంగాణ పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

అమిత్ షా

అమిత్ షా

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక మంది సీనియర్ నేతలు, జాతీయ నాయకుల సహకారంతో పార్టీ మంచి మెరుగైన స్థితిలో ఉన్నా ఓట్లు, ఎన్నికల ఫలితాల దగ్గరకు వచ్చేసరికి అనుకున్నంతగా ఫలితాలను సాధించలేకపోతున్నామని అన్నారు.

అమిత్ షా

అమిత్ షా

తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా గురువారం నాడు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అమిత్ షా

అమిత్ షా

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రాడ్యూయేట్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టే విషయంలో సంఘటితంగా పనిచేయాలని లంబాడా హక్కుల సమితి జాతీయ అధ్యక్షుడు బెల్లా నాయక్ పార్టీ నిర్మాణానికి పనిచేస్తామని వారు చెప్పారు.

బిజెపికి అనుకూలంగా ఉన్న నేతలందరూ వెంటనే పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేయాలని వారికి అమిత్ షా హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగున్నర శాతం ఆదరణ అదనంగా పెరిగిందని సర్వేలు తెలిపాయని ఇలాంటి అనుకూల వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవాలని అన్నారు. 20 ఏళ్ల క్రితం దేశం అంతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేని దుస్థితికి చేరుకోవడానికి కారణం క్షేత్రస్థాయిలో పటిష్టంగా లేకపోవడమేనని అమిత్ షా వ్యాఖ్యానించారు.

గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలోనూ, శుక్రవారం నాడు ఆంధ్రా రాష్ట్రంలో పర్యటించి ఆయన ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, దినేష్‌రెడ్డి తదితరులు కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+